ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sankranti: కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు.. ఎందుకంటే..

ABN, Publish Date - Jan 16 , 2025 | 08:02 AM

సంక్రాంతి పండుగలో మూడో రోజైన కనుమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఈ పండుగను రైతుల పండుగగా చెబుతుంటారు. ఏడాదంతా తమ కష్టాల్లో భాగమైన పశువులను పూజించుకునే వేడుకను రైతులు ఎంతో సంబరంగా జరుపుకుంటారు. ఆ రోజు పశువులను పూజిస్తారు.

ABN Internet: సంక్రాంతి పండుగ (Sankranti festival)ను తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) ప్రజలంతా ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. ఉద్యోగం, చదువు, వ్యాపారం.. ఇలా రకరకాల కారణాలతో సొంతూళ్లకు దూరంగా ఉన్న వారంతా ముందుగానే ప్లాన్ చేసుకుని సంక్రాంతికి సొంతూళ్లకు వస్తారు. సంక్రాంతి మూడు రోజులు (Three days) కుటుంబసభ్యులతో (Family members) సరదాగా గడుపుతారు. అయితే మూడో రోజు కనుమ (Kanuma) పండుగ చేసుకుంటారు. ఆ రోజు మధ్యాహ్నం భోజనాలు ముగించుకుని చాలా మంది తిరుగు ప్రయాణమవుతారు. అయితే ఈ రోజు ప్రయాణాలు చేయకూడదని పెద్దలు చెబుతుంటారు. కనుమ రోజు కాకులు కూడా ఎక్కడికీ కదలవని చెబుతుంటారు. దీని వెనుక అసలు కారణం ఏంటో తెలుసుకుందాం...


అసలు కారణం ఏంటంటే..

సంక్రాంతి పండుగలో మూడో రోజైన కనుమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఈ పండుగను రైతుల పండుగగా చెబుతుంటారు. ఏడాదంతా తమ కష్టాల్లో భాగమైన పశువులను పూజించుకునే వేడుకను రైతులు ఎంతో సంబరంగా జరుపుకుంటారు. ఆ రోజు పశువులను పూజిస్తారు. పశువులకు శుభ్రంగా స్నానం చేయించి.. పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. తర్వాత పశువులకు హారతి ఇచ్చి పూజిస్తారు. అందుచేత ఆ రోజు ప్రయాణాలు చేయకూడదని పెద్దలు చెబుతారు. పూర్వం గ్రామాల్లో ప్రజలు ప్రయాణాలకు ఎక్కువగా ఎడ్ల బండ్లను ఉపయోగించే వారు. ఎంత దూరమైనా సరే ఎడ్ల బండ్లపైనే ప్రయాణించేవారు. అయితే పశువుల పండుగగా భావించే కనుమ రోజు వాటికి విశ్రాంతి కల్పించాలనే ఉద్దేశంతో పెద్దలు ఈ నియమాన్ని తీసుకొచ్చారు. అంచేత కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదని అంటారు. అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరిగడంతో ఎడ్ల బండ్ల ప్రయాణాలు లేవు.. కార్లు వచ్చాయి. ప్రజలంతా కార్లు, బస్సులు, రైళ్లలో ప్రయాణాలు చేస్తున్నారు. అయితే ఆచారాన్ని మాత్రం ఇంకా గ్రామాల్లో పాటిస్తూనే ఉన్నారు. కనుమ రోజు సరదాగా గడుపుకుని మరుసటి రోజు ప్రయాణం చేయమని పెద్దలు చెబుతుంటారు. ఇదే కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదనడానికి కారణం.


కోడి పందాలు

సంక్రాంతి పండుగకు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. ఆంధ్రాలో సంక్రాంతి పండుగను పెద్దగా పండుగగా జరుపుకుంటారు. ఎక్కడెక్కడ ఉన్నవాళ్లంతా కుటుంబాలతో సంక్రాంతికి సొంతూరుకు చేరుకుంటారు. ముగ్గులు, పిండి వంటలు, హరిదాస కీర్తనలు, కొత్త అల్లుళ్ల రాక ఇలా.. పండగ మూడు రోజులు ప్రతీ ఇళ్లు పిల్లా పాపలతో సంతోషంతో కలకలలాడుతుంటాయి. ఇక్కడ మరో అంశం ఏంటంటే.. కోడి పందాలు భీమవరంతో పాటు గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందాలను వీక్షించేందుకు ఎక్కడెక్కడినుంచో వస్తారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కోట్లలో కూత

కన్నుల పండువగా ప్రభల ఉత్సవం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 16 , 2025 | 08:03 AM