ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

10వేల ఇళ్లకు సోలార్‌ విద్యుత్‌ లక్ష్యం

ABN, Publish Date - Apr 02 , 2025 | 12:21 AM

ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి రాష్ట్రంలో ఒక ప్రత్యేక పథకాన్ని ప్రారంభించి ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ తెలిపారు.

14వ డివిజన్‌లో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌

10వేల ఇళ్లకు సోలార్‌ విద్యుత్‌ లక్ష్యం

ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌

పటమట, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి రాష్ట్రంలో ఒక ప్రత్యేక పథకాన్ని ప్రారంభించి ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ తెలిపారు. 14వ డివిజన్‌ ఎన్‌ఎస్‌ఎం స్కూల్‌ సమీపంలో మంగళవారం ఆయన పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డివిజన్‌లో ఇద్దరు నిరుపేద కుటుంబాలకు చెందిన కార్యకర్తలకు తన సొంత నిధులతో బడ్టీ కొట్టు, ప్లాట్‌ఫాం రిక్షాను ఆయన అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సీఎం అయిన తొలి సారి డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశార న్నారు. ఇప్పుడు సోలార్‌ విద్యుత్‌ను అందు బాటులోకి తీసుకువచ్చారన్నారు. నియోజక వర్గంలో 10 వేల ఇళ్లకు సోలార్‌ విద్యుత్‌ అమలు చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు చెప్పారు. ఈ పథకానికి ఉన్న రాయితీలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు ఎల్లబాబు, కార్పొరేటర్‌ ముమ్మనేని ప్రసాద్‌, నర్రా కిషోర్‌, నాగరాజు, గరికపాటి బద్రీ, డాంగియా కుమారి, సాంబయ్య పాల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2025 | 12:21 AM