ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

దుర్గామల్లేశ్వరులకు విశేష పూజలు

ABN, Publish Date - Apr 28 , 2025 | 12:23 AM

ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వరులకు, పరివార దేవతలకు చైత్రమాస బహుళ అమావా స్య సందర్భంగా విశేష నిత్య పూజలు వైభవంగా జరిగాయి.

చండీహోమం జరిపిస్తున్న పండితులు

ఇంద్రకీలాద్రి, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వరులకు, పరివార దేవతలకు చైత్రమాస బహుళ అమావా స్య సందర్భంగా విశేష నిత్య పూజలు వైభవంగా జరిగాయి. ఆదివారం అమావాస్యను పురస్కరించుకుని ఆది దంపతుల సన్నిధిలో భక్తులు ఆర్జిత సేవల్లో విశేషంగా పాల్గొన్నారు. ఉదయం సుప్రభాతసేవ, ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, చండీహోమం, శ్రీచక్ర నవావరణార్చన, శాంతి కల్యాణం పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చండీ హోమానికి 197 ఆర్జిత సేవా టికెట్లు కొనుగోలు చేసి 400 మందికి పైగా భక్తు లు పూజలో పాల్గొన్నారు. ఆదివారం కావటంతో కనకదుర్గమ్మ దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఉదయం నుంచే రూ.500 టికెట్ల అమ్మకాలు నిలిపివేసి అంతరాలయ దర్శనాలు నిలుపుదల చేసి, ముఖమండపం నుంచి వేగంగా వివిధ దర్శనం క్యూలైన్లు నడిచేలా ఆలయ అధికా రులు చూశారు. ఉపాలయాల్లో భక్తుల రద్దీకి తగ్గ ట్టు ఏర్పాట్లు చేశారు.

Updated Date - Apr 28 , 2025 | 12:23 AM