అమరావతి ప్రధాన రహదారుల పనులకు టెండర్ల ఖరారు

ABN, Publish Date - Mar 15 , 2025 | 01:34 AM

రాజధాని అమరావతిలో ప్రధాన రహదారుల పనులను పరుగులు పెట్టించేందుకు హడ్కో, కేఎ్‌ఫడబ్ల్యూ నిధులతో చేపట్టే 24 ప్యాకేజీ పనులకు టెండర్లను సీఆర్‌డీఏ అధికారులు ఖరారు చేశారు.

అమరావతి ప్రధాన రహదారుల పనులకు టెండర్ల ఖరారు

హడ్కో, కేఎ్‌ఫడబ్ల్యూ నిధులతో 24 ప్యాకేజీల్లో ప్రధాన రోడ్లకు టెండర్లు

ఎల్‌-1గా నిలిచిన సంస్థల వివరాలను ప్రకటించిన సీఆర్‌డీఏ

కాంట్రాక్టు సంస్థలకు ఎల్‌వోఏలు ఇచ్చేందుకు సీఆర్‌డీఏ సన్నాహాలు

విజయవాడ, మార్చి 14(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో ప్రధాన రహదారుల పనులను పరుగులు పెట్టించేందుకు హడ్కో, కేఎ్‌ఫడబ్ల్యూ నిధులతో చేపట్టే 24 ప్యాకేజీ పనులకు టెండర్లను సీఆర్‌డీఏ అధికారులు ఖరారు చేశారు. ప్రధాన రోడ్లకు పిలిచిన టెండర్లలో ఎల్‌-1గా నిలిచిన సంస్థలను సీఆర్‌డీఏ అధికారులు ప్రకటించారు. హడ్కో నుంచి తీసుకునే రూ.11 వేల కోట్ల రుణం, కేఎ్‌ఫడబ్ల్యూ నుంచి తీసుకునే రూ.5 వేల కోట్ల రుణం మొత్తం రూ. 16 వేల కోట్ల రుణంలో భాగంగా చేపట్టే పనుల్లో రోడ్ల పనులు కూడా ప్రధానమైనవి. హడ్కో చైర్మన్‌ను సీఆర్‌డీఏ అథారిటీలో సభ్యుడిగా నియమించేందుకు ప్రభుత్వం అనుమతి తెలిపినట్టు తెలుస్తోంది. తమ నిధులతో చేసే పనులను హడ్కో సమీక్షించటానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. హడ్కో, కేఎ్‌ఫడబ్ల్యూ నిధులతో రాజధానిలో ఈ-6, ఈ-5, ఈ-7, ఈ-11, ఈ-13, ఈ-15, ఎన్‌-13, ఈ-2, ఈ-4, ఎన్‌-8, ఎన్‌-4, ఈ-10, ఈ-12, ఎన్‌-7, ఎన్‌-10, ఎన్‌-14, ఎన్‌-16, ఎన్‌-17, ఈ-3(ఫేజ్‌-2), ఈ-16, ఎన్‌-1, ఎన్‌-2, ఎన్‌-3ఏ, 3బీ, ఎన్‌-5 రోడ్లకు పిలిచిన టెండర్లలో బడా సంస్థలు టెండర్లు వేశాయి.

ఎల్‌-1గా నిలిచి రోడ్ల పనులకు టెండర్లు దక్కించుకున్న సంస్థలు

ఈ-6 రోడ్డు పనులకు ఆర్‌వీఆర్‌ ప్రాజెక్ట్స్‌ సంస్థ రూ.337.28 కోట్లకు బిడ్‌ను కోట్‌ చేసింది.

ఈ-5 రోడ్డు పనులకు బీఎ్‌సఆర్‌ సంస్థ రూ.562.28 కోట్లకు బిడ్‌ను కోట్‌ చేసింది.

ఈ-7 రోడ్డు పనులకు బీఎ్‌సఆర్‌ సంస్థ రూ.369.38 కోట్లకు బిడ్‌ను కోట్‌ చేసింది.

ఈ-11 రోడ్డు పనులకు మేఘా సంస్థ రూ.156.92 కోట్లకు బిడ్‌ను కోట్‌ చేసింది.

ఈ-13 రోడ్డు పనులకు ఆర్‌వీఆర్‌ ప్రాజెక్ట్స్‌ సంస్థ రూ.207.85 కోట్లకు బిడ్‌ను కోట్‌ చేసింది.

ఈ-15 రోడ్డు పనులకు బీఎ్‌సఆర్‌ సంస్థ రూ.194 కోట్లకు బిడ్‌ను కోట్‌ చేసింది.

ఎన్‌-13 రోడ్డు పనుల టెండర్లకు ఆర్‌వీఆర్‌ సంస్థ రూ.254.10కోట్లకు బిడ్‌నుకోట్‌ చేసింది.

ఈ-2 రోడ్డు పనులకు బీఎ్‌సఆర్‌ సంస్థ రూ.157.47 కోట్లకు బిడ్‌ను కోట్‌ చేసింది.

ఈ-4 రోడ్డు పనులకు మేఘా సంస్థ రూ. 515.53 కోట్లకు బిడ్‌ను కోట్‌ చేసింది.

ఎన్‌-8 రోడ్డు పనులకు ఎస్‌సీసీ సంస్థ రూ. 605.04 కోట్లకు బిడ్‌ను కోట్‌ చేసింది.

ఎన్‌-4 రోడ్డు పనులకు బీఎ్‌ససీపీఎల్‌ సంస్థ రూ.246.41 కోట్లకు కోట్‌ చేసింది.

ఈ-10 రోడ్డు పనులకు మేఘా సంస్థ రూ.295.84 కోట్లకు బిడ్‌ను కోట్‌ చేసింది.

ఈ-12 రోడ్డు పనులకు బీఎ్‌సఆర్‌ సంస్థ రూ.255.60 కోట్లకు బిడ్‌ను కోట్‌ చేసింది.

ఎన్‌-7 రోడ్డు పనులకు ఆర్‌వీఆర్‌ సంస్థ రూ.453.92 కోట్లకు బిడ్‌ను కోట్‌ చేసింది.

ఎన్‌-14 రోడ్డు పనుల టెండర్లకు ఆర్‌వీఆర్‌ సంస్థ రూ.252.73 కోట్లకు కోట్‌ చేసింది.

ఎన్‌-16 రోడ్డు పనులను బీఎ్‌ససీపీఎల్‌ సంస్థ రూ.191.92 కోట్లకు కోట్‌ చేసింది.

ఎన్‌-17 రోడ్డు పనుల టెండర్లను బీఎ్‌ససీ సంస్థ రూ.186.74 కోట్లకు కోట్‌ చేసింది.

ఈ-3 (ఫేజ్‌-2) రోడ్డు పనులను ఎన్‌సీసీ సంస్థ రూ.188.45 కోట్లకు కోట్‌ చేసింది.

ఈ-16 రోడ్డు పనులకు ఎన్‌సీసీ సంస్థ రూ.141.45 కోట్లకు బిడ్‌ను కోట్‌ చేసింది.

ఎన్‌-1 రోడ్డు పనులకు బీఎ్‌సఆర్‌ సంస్థ రూ.125.08 కోట్లకు బిడ్‌ను కోట్‌ చేసింది.

ఎన్‌-2 రోడ్డు పనుల టెండర్లలో బీఎ్‌సఆర్‌ సంస్థ రూ.111.84 కోట్లకు కోట్‌ చేసింది.

ఎన్‌-3ఏ, 3బీ రోడ్ల పనుల టెండర్లలో బీఎస్‌సీపీఎల్‌ సంస్థ రూ.154.75 కోట్లకు బిడ్‌ను కోట్‌ చేసింది.

ఎన్‌-5 రోడ్డు టెండర్లలో ఎన్‌సీసీ సంస్థ రూ.70.63 కోట్లకు బిడ్‌ను కోట్‌ చేసింది.

Updated Date - Mar 15 , 2025 | 01:34 AM