దివ్యాంగుల అభ్యున్నతే ధ్యేయం
ABN, Publish Date - Mar 15 , 2025 | 01:41 AM
దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కూట మి ప్రభుత్వం కృషిచేస్తోందని, వారి అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తోందని ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు.

విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని
మొగల్రాజపురం, మార్చి 14(ఆంధ్రజ్యోతి): దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కూట మి ప్రభుత్వం కృషిచేస్తోందని, వారి అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తోందని ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు. కేంద్ర ప్రభుత్వ అలింకో సంస్థ సహకారంతో ఎంపీ ఆధ్వర్యంలో పీబీ సిద్ధార్థ ఆడిటోరియంలో నగరంలోని మూడు నియోజకవర్గాలకు చెందిన 715 మందికి బ్యాటరీ ట్రైసైకిళ్లు, ట్రై సైకిళ్లు, చంక కర్రలు, వీల్‌చైర్లు, వినికిడి యంత్రాలు, కృత్రిమ అవయవాలు, క్యాలిపర్స్, ఎంఎ్‌సఐడీ కిట్లు, రోల్లెటర్లను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కలెక్టర్ లక్ష్మీశ పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల సమస్యలు పట్టించుకోలేదని, మూడున్నరేళ్లుగా ఎంపిక చేసిన వారికి ఉపకరణాలు ఇవ్వలేదని ఎంపీ విమర్శించారు. కేంద్రం 2022లో ఉపకరణాలకు జాబితా ఇస్తే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కూటమి అధికారంలోకి రాగానే సీఎం చం ద్రబాబుతో చెప్పి కలెక్టర్, జిల్లా అధికారులతో కలిసి కేంద్రం మంజూరు చేసి న పరికరాలను రెండు నెలల క్రితం హైదరాబాద్ నుంచి తెప్పించామని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ కోడ్ కారణంగా పంపిణీ ఆలస్యమైందన్నారు. ఎంపీ కేశినేని చిన్ని చొరవతోనే ఉపకరణాల పంపిణీ జరిగిందని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. ఎన్టీఆర్ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు పనిచేస్తున్మాని, అందుకు ఎంపీ కేశినేని చిన్ని చొరవతో ముందుకు వెళుతున్నామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ఏపీ బిల్డింగ్ అండ్ అదర్స్ కన్‌స్ట్రక్ష్ వర్కర్స్ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, ఎన్టీఆర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి, కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, అలింకో సంస్థ ప్రతినిధి రవిశంకర్ పాల్గొన్నారు.
Updated Date - Mar 15 , 2025 | 01:41 AM