ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి

ABN, Publish Date - Jan 11 , 2025 | 12:20 AM

నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంతోపాటుగా కార్పొరేషన్‌కు అవార్డులు తీసుకురావడంలో వారి పాత్ర కీలకమని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ పేర్కొన్నారు.

పారిశుధ్య కార్మికులకు నూతన వస్ర్తాలు అందజేస్తున్న తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, తదితరులు

పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి

నూతన వస్త్రాల పంపిణీలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌

భారతీనగర్‌, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంతోపాటుగా కార్పొరేషన్‌కు అవార్డులు తీసుకురావడంలో వారి పాత్ర కీలకమని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధి మూడో డివిజన్‌లోని కనకదుర్గనగర్‌ కాలనీకి చెందిన గాలి లక్ష్మీ అలేఖ్య 28వ జయంతి సందర్భంగా గాలి వెంకట రవికుమార్‌ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మూడవ డివిజన్‌లో విధులు నిర్వహిస్తున్న 100 మంది పారిశుధ్య కార్మికులకు శుక్రవారం గద్దె నూతన వస్ర్తాలను అందజేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ మాట్లాడుతూ కరోనా సమయంలో పారిశుధ్య కార్మికులు చేసిన సేవలు మరువలేనివని అన్నారు. పారిశుధ్య కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటుగా స్వచ్ఛతా సర్వేక్షన్‌ ర్యాకింగ్‌లో అవార్డులు వచ్చే విధంగా అధికారులు చూస్తున్నారని అన్నారు. డివిజన్‌లో మొక్కలను క్రమపద్ధతిలో పెంచడం, పరిశుభ్రవాతావరణం ఉండేలా అధికారులు చూస్తున్నారని అన్నారు. పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తించి వారికి నూతన వస్ర్తాలు అందజేసిన గాలి వెంకట రవికుమార్‌ కుటుంబసభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్‌ సీఎంవోహెచ్‌ సురేష్‌బాబు, గాలి వెంకట రవికుమార్‌, ఉషశ్రీ, గాలి గణేష్‌ సాయి చైతన్య, గద్దె క్రాంతిబాబు, గద్దె రమేష్‌, తాడి బాబూరావు, యలమంచిలి పండు, బండి కోమలి, ఏఎంహెచ్‌వో బాబూ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2025 | 12:20 AM