ముగ్గు మనోహరం
ABN, Publish Date - Jan 14 , 2025 | 01:03 AM
రావివారిపాలెంలోని రావి సురేశ్ ఇంటి వద్ద సిమెంట్ రోడ్డుపై ఆయన సతీమణి జయశ్రీ 500 మీటర్ల పొడవునా 30 రకాల రంగ వల్లులను సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించేలా బంధుమిత్రులతో కలసి తీర్చిదిద్దారు.
500 మీటర్ల పొడవు రోడ్డుపై 30 రంగవల్లులు
మోపిదేవి, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): మోపిదేవి పంచాయతీ శివారు రావివారిపాలెంలోని రావి సురేశ్ ఇంటి వద్ద సిమెంట్ రోడ్డుపై ఆయన సతీమణి జయశ్రీ 500 మీటర్ల పొడవునా 30 రకాల రంగ వల్లులను సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించేలా బంధుమిత్రులతో కలసి తీర్చిదిద్దారు. రెండు రోజులు పగలూ, రాత్రి కష్టపడి రూ.25 వేలు ఖర్చు పెట్టి ముగ్గులు వేసినట్లు జయశ్రీ తెలిపారు. టీడీపీ గుర్తు, ఎన్టీఆర్ విగ్రహం, ధాన్య లక్ష్మి ఆకారంలో తీర్చి దిద్దిన రంగవల్లులు అం దరినీ ఆకట్టుకుంటున్నాయి. పురాతన నాణేలు కూడా రంగవల్లుల్లో ఉంచి సుందరంగా తీర్చిదిద్దారు.
Updated Date - Jan 14 , 2025 | 01:03 AM