Share News

భక్తుల మనోభావాలు దెబ్బతీస్తే సహించం

ABN , Publish Date - Apr 14 , 2025 | 12:37 AM

తిరుమల తిరుపతి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడితే కూటమి ప్రభుత్వం సహించబోదని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌ హెచ్చరించారు.

భక్తుల మనోభావాలు దెబ్బతీస్తే సహించం

గోశాలలో ఆవులు చనిపోవడం అవాస్తవం

టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారు: ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌

గూడూరు, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): ‘టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి గోశాలలో వందలాది ఆవులు చనిపోయాయని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గోశాలలో ఆవులు చనిపోలేదు. తిరుమల తిరుపతి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడితే కూటమి ప్రభుత్వం సహించబోదు.’ అని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌ హెచ్చరించారు. ఆదివారం గూడూరులోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమల దేవస్థాన భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడే వారికి భక్తులు ఇప్పటికే తగిన గుణపాఠం చెప్పారని, అయినా వైసీపీ నాయకులకు బుద్ధి రాలేదని ఆయన అన్నారు. గతంలో వేంకటేశ్వరస్వామి నల్లరాయని, చెప్పులు విసిరితే ఏమవుతుందన్న భూమన కరుణాకరరెడ్డి ఇప్పుడు అసత్యప్రచారాలు చేస్తున్నారన్నారు. డీసీ చైర్మన్‌ పోతన స్వామి, టీడీపీ నాయకులు కట్టా మునీశ్వరరావు, గోపీ నాగబాబు, గొరిపర్తి ఫణి, తోట వేణు, కూటమి నాయకులు పోతన రామోజీ, బాసంశెట్టి విజయ్‌, రాసంశెట్టి దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2025 | 12:37 AM