పెంటాథ్లాన్ గేమ్‌కు విస్తృత ప్రచారం
ABN, Publish Date - Apr 14 , 2025 | 12:34 AM
పెంటాథ్లాన్ గేమ్‌కు విస్తృత ప్రచారం కల్పించి రాష్ట్రంలోని క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా మోడరన్ పెంటాథ్లాన్ అసోసియేషన్ కృషి చేస్తుందని చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు.
పెంటాథ్లాన్ గేమ్‌కు విస్తృత ప్రచారం
అసోసియేషన్ చైర్మన్
డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు
పటమట, ఏప్రిల్ 13 (ఆంధ్ర జ్యోతి): పెంటాథ్లాన్ గేమ్‌కు విస్తృత ప్రచారం కల్పించి రాష్ట్రంలోని క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా మోడరన్ పెంటాథ్లాన్ అసోసియేషన్ కృషి చేస్తుందని చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. ఆదివారం విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్లో జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మేఘాలయాలో వచ్చే ఏడాది జనవరిలో జరిగే జాతీయ క్రీడలకు ఎక్కువ మందిని పంపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నూతన అధ్యక్షుడిగా ఉజ్వల ప్రసాద్, చైర్మన్‌గా చప్పిడి వెంకటేశ్వరరావు, కోశాధికారిగా డింపుల్ కృష్ణ, కార్యదర్శి ఆర్.కృష్ణయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయవాడ, కాకినాడ, తిరుపతిలో కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి ఈ క్రీడను మరింత ముందుకు తీసుకెళతామని వారు స్పష్టం చేశారు.
Updated Date - Apr 14 , 2025 | 12:35 AM