డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం
ABN, Publish Date - Jan 12 , 2025 | 12:48 AM
రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన కళ్యాణ్ శనివారం జిల్లా పర్యటనలో భాగంగా గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఓర్వకల్లు విమానాశ్ర యానికి ఉదయం 12.52 గంటలకు చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో 1.05 గంటలకు ఓర్వకల్లు ఘనిలో ఉన్న సోలార్ విద్యుత ప్రాజెక్టు పంపు స్టోరేజీ ప్రాజె క్టును సందర్శించేందుకు బయలుదేరి వెళ్లారు.
ఓర్వకల్లు, జనవరి 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన కళ్యాణ్ శనివారం జిల్లా పర్యటనలో భాగంగా గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఓర్వకల్లు విమానాశ్ర యానికి ఉదయం 12.52 గంటలకు చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో 1.05 గంటలకు ఓర్వకల్లు ఘనిలో ఉన్న సోలార్ విద్యుత ప్రాజెక్టు పంపు స్టోరేజీ ప్రాజె క్టును సందర్శించేందుకు బయలుదేరి వెళ్లారు. డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్‌కు ఓర్వక ల్లు విమానాశ్రయంలో కలెక్టర్ పి.రంజిత బాషా, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్, ఎమ్మిగనూరు, కోడుమూరు ఎమ్మెల్యేలు జయనాగేశ్వరరెడ్డి, బొగ్గుల దస్తగిరి, గ్రీన కో ప్రాజెక్టు ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. డిప్యూటీ సీఎం పర్యటనను ముగించుకుని సాయం త్రం 4.40 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో చేరుకుని 4.45 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లారు. ఆయనకు ఆయా శాఖల అధికారులు వీడ్కోలు పలికారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా ఎస్‌ఐ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం పవనను చూసేందుకు జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ విద్యాసాగర్, ఎంపీడీవో శ్రీనివాసులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jan 12 , 2025 | 12:48 AM