మళ్లీ వైరస్ టెన్షన్..
ABN, Publish Date - Jan 08 , 2025 | 01:08 AM
కరోనా వైరస్ పుట్టిన చైనా నుంచి మరో మహమ్మారి వ్యాప్తి చెందుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్నది. కొద్ది రోజులుగా చైనాలో హ్యూమన్ మెటన్యూమో వైరస్ (హెచ్‌ఎంపీవీ) వ్యాప్తి చెందుతోంది.
సీఎం టెలీ కాన్ఫరెన్స్
జీజీహెచ్‌లో 20 పడకలతో ప్రత్యేక వార్డు
కర్నూలు హాస్పిటల్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ పుట్టిన చైనా నుంచి మరో మహమ్మారి వ్యాప్తి చెందుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్నది. కొద్ది రోజులుగా చైనాలో హ్యూమన్ మెటన్యూమో వైరస్ (హెచ్‌ఎంపీవీ) వ్యాప్తి చెందుతోంది. మన దేశంలో కూడా హెచ్‌ఎంపీవీ వైరస్ కేసులు వెలుగు చూడటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఓల్డ్ గైనిక్ విభాగంలో 20 పడకల హెచ్‌ఎంపీవీ వైరస్ విభాగాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఆసుపత్రిలో అవసర మైన మందులు, వైద్య పరికరాలు, సిబ్బంది అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కేసుల దృష్ట్యా ఆసుపత్రిలోని హెచ్‌ఎంపీవీ వైరస్‌ను ఎదుర్కోడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఆసుపత్రిలో ఎలాంటి హెచ్‌ఎంపీవీ వైరస్ కేసు నమోదు కాలేదన్నారు. ఫల్మనాలజీ, అనస్థీషియా, మెడిసిన్, మైక్రో బయాలజీ ఎస్‌పీఎం, పీడియాట్రిక్ వైద్యులు అందు బాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ సూపరింటెండెంట్లు డా.కే. సీతారామయ్య, డా.డి. శ్రీరాములు, సీఎస్‌ఆర్‌ఎంవో డా.బీవీ రావు, వైస్ ప్రిన్సిపాల్ డా. రేణుకాదేవి, ఫల్మనాలజీ హెచ్‌వోడీ డా.శ్రీకాం త్, అనెస్థీషియా ప్రొఫెసర్ డా.శ్రీ కాంత్, మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ డా. శ్రీనివాసులు పాల్గొన్నారు.
ఆరుగురు వైద్యులతో ఎక్స్‌పర్ట్ కమిటీ:
మైక్రోబయాలజీ హెచ్‌వోడీ డా. రేణుకాదేవి
ఎస్‌పీఎం విభాగాధిపతి డా. సుధాకుమారి
పీడియాట్రిక్ హెచ్‌వోడీ డా. విజయానంద్‌బాబు
జనరల్ మెడిసిన్ హెచ్‌వోడీ డా. ఇక్బాల్ హుశేన్
పల్మనాలజీ మెడిసిన్ హెచ్‌వోడీ డా. శ్రీకాంత్
అనస్థీషియా హెచ్‌వోడీ డా.విశాలను
నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Updated Date - Jan 08 , 2025 | 01:08 AM