కమనీయం.. అంబా భవాని రథోత్సవం
ABN, Publish Date - Jan 13 , 2025 | 11:48 PM
మండలంలోని అర్లబండ గ్రామంలో అంబా భవాని రథోత్సవం సోమవారం రమణీయంగా సాగింది. వెంకమాంబ కృష్ణావధూత పీఠాధిపతి మర్రిస్వామితాత, కృష్ణస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం అశేష జనవాహిని మధ్య రథోత్సవం నిర్వహించారు
వేలాదిగా తరలి వచ్చిన భక్తులు
పాల్గొన్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, మంత్రాలయం ఇన్‌చార్జి రాఘవేంద్రారెడ్డి
కోసిగి, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అర్లబండ గ్రామంలో అంబా భవాని రథోత్సవం సోమవారం రమణీయంగా సాగింది. వెంకమాంబ కృష్ణావధూత పీఠాధిపతి మర్రిస్వామితాత, కృష్ణస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం అశేష జనవాహిని మధ్య రథోత్సవం నిర్వహించారు. కర్నూలు పార్లమెంటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి, మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి రాఘవేంద్రా రెడ్డి అమ్మవారిని దర్శించుకుని మఠం పీఠాధిపతి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ వేడుకలకు మన రాష్ట్రంతో పాటు కర్ణాటక నుంచి వేలాదిగా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. కోసిగి ఎస్‌ఐ చంద్రమోహన్, కౌతాళం సీఐ అశోక్ కుమార్, మాధవరం ఎస్‌ఐ విజయకుమార్ గట్టి బందోబస్తు నిర్వహించారు. టీడీపీ నాయకులు ముత్తురెడ్డి, పల్లెపాడు రామిరెడ్డి, ఆర్లబండ సర్పంచ్ మల్లికార్జున, అయ్యప్ప, జ్ఞానేష్, నాడిగేని అయ్యన్న పాల్గొన్నారు.
Updated Date - Jan 13 , 2025 | 11:48 PM