Share News

దేశప్రగతిని మార్చిన వ్యక్తి అంబేడ్కర్‌

ABN , Publish Date - Apr 15 , 2025 | 12:21 AM

దేశ ప్రగతిని మార్చిన మహోన్నత వ్యక్తి అంబేడ్కర్‌ అని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొనియాడారు.

దేశప్రగతిని మార్చిన వ్యక్తి అంబేడ్కర్‌
అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌, కలెక్టర్‌ రాజకుమారి

న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌

అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన

నంద్యాల టౌన్‌, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): దేశ ప్రగతిని మార్చిన మహోన్నత వ్యక్తి అంబేడ్కర్‌ అని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొనియాడారు. సోమవారం డా.బిఆర్‌ అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకొని కలెక్టర్‌ రాజాకుమారితో కలిసి బొమ్మలసత్రంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నంద్యాల పురపాలక కార్యాలయంలో అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, హక్కుల సాధనకు ఆయన చేసిన కృషి చిరస్మరనీయమన్నారు. రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించారని అన్నారు. ఆయన కృషితోనే భారత్‌ ప్రపంచంలోనే బలమైన ప్రజాస్వామ్య దేశంగా అవిర్భవించిందని పేర్కొన్నారు. దేశంలోనే మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారని గర్తుచేశారు. దేశంలో అంటరానితనాన్ని రూపుమాపడానికి అంబేడ్కర్‌ ఎనలేని కృషి చేశారన్నారు. కార్యక్రమంలో నంద్యాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మాబున్నీసా, కమిషనర్‌ నిరంజన్‌రెడ్డి, కౌన్సిలర్లు, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 15 , 2025 | 12:21 AM