పెద్దాసుపత్రి ఆఫీసు సూపరింటెండెంట్‌గా ఆర్లే శ్రీనివాసులు
ABN, Publish Date - Jan 02 , 2025 | 01:12 AM
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆఫీసు సూపరింటెండెంట్‌గా ఆర్లే శ్రీనివాసులును నియమిస్తూ వైద్యఆరోగ్యశాఖ రీజనల్ డైరెక్టర్ (కడప) డాక్టర్ రామగిడ్డయ్య ఆదేశాలు జారీ చేశారు.
కర్నూలు హాస్పిటల్, జనవరి 1(ఆంధ్రజ్యోతి): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆఫీసు సూపరింటెండెంట్‌గా ఆర్లే శ్రీనివాసులును నియమిస్తూ వైద్యఆరోగ్యశాఖ రీజనల్ డైరెక్టర్ (కడప) డాక్టర్ రామగిడ్డయ్య ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం కడప ఆర్డీ ఆఫీసులో ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లకు ఆఫీస్ సూపరింటెండెంట్లుగా పదోన్న తుల కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇందులో కర్నూలు జీజీహెచ కార్యా యలంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఏ.శ్రీనివాసులును పదోన్నతి కల్పిస్తూ కర్నూలు సర్వజన వైద్యశాల ఆఫీసు సూపరింటెండెంట్‌గా నియమించారు. బుధవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కే. వెంకటేశ్వర్లు సమక్షంలో ఆయన విధుల్లో చేరారు. అనంతరం హాస్పి టల్ అడ్మినిస్ర్టేటర్ పి.సింధూ సుబ్రహ్మణ్యంను ఆయన మర్యాద పూర్వ కంగా కలిశారు. తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తానని శ్రీనివాసులు తెలిపారు.
Updated Date - Jan 02 , 2025 | 01:12 AM