రమణీయం.. శ్రీశైలేశుడి రథోత్సవం

ABN, Publish Date - Mar 31 , 2025 | 12:25 AM

నంద్యాల జిల్లా శ్రీశైల క్షేత్రంలో ఉగాది మహోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన దేవదేవుల రథోత్సవం రమణీయంగా సాగింది.

రమణీయం.. శ్రీశైలేశుడి రథోత్సవం
రథోత్సవంలో పాల్గొన్న భక్తులు

తరలివచ్చిన అశేష భక్తజనం

శివనామ స్మరణతో మార్మోగిన శ్రీగిరి

శ్రీశైౖలం, మార్చి 30(ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా శ్రీశైల క్షేత్రంలో ఉగాది మహోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన దేవదేవుల రథోత్సవం రమణీయంగా సాగింది. ఉభయ దేవా లయ ప్రాంగణంలో విశేష అర్చనలు, హారతులందుకున్న స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో రాజగోపురం మీదుగా రథశాల వద్దకు మేళ తాళాలు, భజంత్రీల మధ్య నడుమ తీసుకొచ్చారు. గంగాధర మండపం నుంచి నంది మండపం దాకా, అక్కడి నుంచి తిరిగి గంగాధర మండ పం వరకు రథోత్సవం సాగింది. రథంపై ఆదిదేవులు ఆశీనులై ముం దుకు సాగుతుండగా భక్తుల శివ నామస్మరణతో శ్రీగిరి క్షేత్రం మార్మోగింది. రథం ముందు కోలాటం, కర్ణాటక జాంజ్‌, వీరగాసి, కొమ్ము వా యిద్యం, నందికోలుసేవ, బీరప్పడోలు, పగటివేశధారణ ప్రదర్శ నలు భక్తులను ఎంత గానో ఆకట్టుకున్నాయి. రమావాణి సేవిత రాజరాజేశ్వరి అలంకారంలో అమ్మ వారు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో చివరి రోజు సోమవారం నిజాలం కరణలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. రాత్రి స్వామి, అమ్మవార్లకు అశ్వవాహన సేవ నిర్వహించనున్నారు.

Updated Date - Mar 31 , 2025 | 12:25 AM