సంబరంగా హోలీ
ABN, Publish Date - Mar 15 , 2025 | 12:38 AM
ఎమ్మిగనూరు పట్టణంలో శుక్రవారం హోలీ వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.

ఎమ్మిగనూరు, మార్చి 14(ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు పట్టణంలో శుక్రవారం హోలీ వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. యువ కులు జట్లు, జట్లుగా ఏర్పడి పట్టణంలో తిరుగుతూ తమ మిత్రులను కలుసుకొని రంగులను ఒకరిపై ఒకరు చల్లుకున్నారు. ముఖ్యంగా పట్టణంలోని తేరుబజారు, ముగతి పేట, బంగారు బజారు, వీవర్స్ కాలనీ, సోమప్ప సర్కిల్, హెచబీఎస్ కాలనీ, శిల్పా ఎస్టేట్‌తో పాటు ఆయా కాలనీల్లో యువతీ, యువకులు హోలీ వేడుకలను ఎంతో సంబ రంగా జరుపుకున్నారు. కొంతమంది ఏకంగా డ్ర మ్స్‌తో పట్టణంలో తిరు గుతూ తమ వెంట తెచ్చుకున్న వివిధ రంగులను మిత్రులపైన, బంధువులపై చల్లి పరస్పరం హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చిన్నారులు వీఽధుల్లో రంగు డబ్బాలను పట్టుకొని తిరుగుతూ సందడి చేశారు. ఇక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైతం హోలీ సంబరాలు జరుపుకున్నారు.
కౌతాళం: మండలంలో శుక్రవారం హోలీ వేడుకలను పిల్లలు, యువకులు, పెద్దలు ఘనంగా జరుపుకున్నారు. ప్రతి వీధుల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రంగులను స్నేహితులు, బంధువులు ఒకరికొకరు పూసుకుని సంబరాలు చేసుకు న్నారు. రంగుల నీళ్లు చల్లుకున్నారు.
మంత్రాలయం: మంత్రాలయంలో హోలీ వేడుకలు ఘనంగా జరుపుకు న్నారు. శుక్రవారం మంత్రాలయం పుణ్యక్షేత్రం ప్రధాన రహదారులు, రాఘ వేంద్రసర్కిల్, బస్టాండ్ ప్రాంతంలో భక్తులు, యువకులు రంగులు చల్లు కుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఈలలు, కేరింతలతో ఉల్లాసంగా, ఉత్సా హంగా తుంగభద్ర నదిలో పుణ్య స్నానాల ఆచరించి గ్రామదేవత మంచా లమ్మను దర్శించుకుని రాఘవేంద్ర స్వామికి పూజలుచేసి మొక్కులు తీర్చు కున్నారు.
Updated Date - Mar 15 , 2025 | 12:38 AM