ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

చౌక దుకాణాల్లో తనిఖీలు

ABN, Publish Date - Apr 01 , 2025 | 11:59 PM

నగరంలోని మంగళవారం సివిల్‌ సప్లయ్‌ అధికారులు విజిలెన్స్‌ అధికారులతో రేషన్‌ పంపిణీ చేస్తున్న ఎండీయూ వాహనాలను, రేషన్‌ షాపులను తనిఖీ చేశారు.

రేషన్‌ దుకాణానికి సీలు వేసిన సివిల్‌ సప్లయ్‌ అధికారులు

కర్నూలు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): నగరంలోని మంగళవారం సివిల్‌ సప్లయ్‌ అధికారులు విజిలెన్స్‌ అధికారులతో రేషన్‌ పంపిణీ చేస్తున్న ఎండీయూ వాహనాలను, రేషన్‌ షాపులను తనిఖీ చేశారు. అందులో భాగంగా అధికారులు ఎండీయూ 62ను తనిఖీ చేయగా.. భౌతిక రేషన్‌ నిలువల్లో 245 కేజీలు బియ్యం, 82 ప్యాకెట్ల చక్కెర తక్కువగా నమోదైంది. అతనిపై సెక్షన్‌ 6ఏ కింద అధికారులు కేసు నమోదు చేశారు. అదే విధంగా తనిఖీ నిమిత్తం కొత్తపేటకు చెందిన రేషన్‌ దుకాణం 53కు అధికారులు వెళ్లగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రేషన్‌ డీలర్‌ దుకాణానికి తాళం వేసి వెళ్లిపోయాడు. ఈ మేరకు అధికారులు రేషన్‌ దుకాణం 53కు నోటీసుతో సీల్‌ వేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌వో రాజారఘువీర్‌, ఏఎన్‌వో రామాంజనేయరెడ్డి, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌ రెడ్డి, విజిలెన్స్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 01 , 2025 | 11:59 PM