వైభవంగా చౌడేశ్వరీ దేవి జ్యోతి ఉత్సవాలు
ABN, Publish Date - Apr 01 , 2025 | 12:10 AM
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కల్లూరులోని చౌడేశ్వరీదేవి జ్యోతి మహోత్సవాలు కన్నుల పండువగా జరిగాయి.
ఆకట్టుకున్న ఎడ్లబండు,్ల గాడిదల ప్రదక్షిణ
వేడుకల్లో పాల్గొన్న భక్తులు
కల్లూరు, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కల్లూరులోని చౌడేశ్వరీదేవి జ్యోతి మహోత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. సోమవారం తెల్లవారుజామున కల్లూరు ఊరువాకిలి నుంయి నిర్వాహకులు అమ్మవారికి జ్యోతులు ఉత్సవాన్ని ప్రాంభించారు. మంగళ వాయిద్యాలు, తోగటవీర క్షత్రియుల పదఖడ్గాలు, నందికోల సేవలతో జ్యోతులను ఊరేగింపుగా తీసికెళ్లి చౌడేశ్వరీదేవి ఆలయంలో సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఉన్నత చదువులు చదివే అభ్యర్థులు, పెళ్లికాని యువత జ్యోతులను ఎత్తుకుని మొక్కులు తీర్చుకున్నారు.
ఆకట్టుకున్న ఎద్దులబండ్లు, గాడిదల ప్రదక్షిణ: ఉగాది వేడుకల్లో భాగంగా చౌడేశ్వరీదేవి ఆలయం చుట్టూ రైతులు ఎద్దుబండ్లు, రజకులు గాడిదలతో ప్రదక్షిణలు చేశారు. ఆనాదిగా వస్తున్న ఆచారంలో భాగంగా కల్లూరు ప్రజలు ఆలయం చుట్టూ నారుమడి పద్ధతిలో బురదనీటిలో ఎద్దులబండ్లు ప్రదక్షిణలు చేపట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ వేడుకలకు జిల్లా న లుమూలల నుండి భక్తులు పెద్దఎత్తున హాజరయ్యారు.
Updated Date - Apr 01 , 2025 | 12:10 AM