ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచాలి

ABN, Publish Date - Jan 05 , 2025 | 01:06 AM

విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.

ఓర్వకల్లులోని జూనియర్‌ కాలేజీలో విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న ఎమ్మెల్యే గౌరు చరిత, మల్లెల రాజశేఖర్‌

మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గౌరు చరిత

ఓర్వకల్లు, జనవరి 4(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. శనివారం ఓర్వకల్లు లోని ఆర్‌సీ ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కూటమి ప్రభు త్వం నూతనంగా ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే గౌరు చరిత, టీటీడీ బోర్డు సభ్యులు మల్లెల రాజశేఖర్‌ హాజరయ్యారు. అనంతరం కళాశాలలో మధ్యా హ్న భోజనం పథకాన్ని వారు ప్రారంభించారు. కళాశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం మధ్యాహ్న భోజనం పథకానికి రూ.27 కోట్లు మంజూరు చేసిందన్నారు. వైసీపీ పాలనలో జగనన్న గోరుముద్ద పథకాన్ని ప్రవేశ పెట్టి నీరు గార్చిందన్నారు. కూటమి ప్రభుత్వం కార్పొ రేట్‌ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ విద్యా సాగర్‌, ఎంపీడీవో శ్రీనివాసులు, ఎంఈవో ఓంకార్‌ యాదవ్‌, ఎస్‌ఐ సునీల్‌ కుమార్‌, చింతలపల్లె సర్పంచ వెంకటర మణ, నాయకులు గోవిందరెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, రాంభూపాల్‌ రెడ్డి, అన్వర్‌ బాషా, ఏసేపు, అల్లాబాబు, జయకృష్ణ, విజయుడు, సర్కార్‌, అధ్యాపకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2025 | 01:06 AM