మంత్రాలయంలో భక్తుల కోలాహలం

ABN, Publish Date - Mar 15 , 2025 | 12:39 AM

రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో మంత్రాలయం కోలాహలంగా మారింది.

మంత్రాలయంలో భక్తుల కోలాహలం
మఠం ప్రాంగణంలో భక్తుల రద్దీ

మంత్రాలయం, మార్చి 14(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో మంత్రాలయం కోలాహలంగా మారింది. శుక్రవారం హోలీ సెలవు దినం, పౌర్ణమి శుభదినం కావటంతో దక్షి ణాది రాష్ర్టాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మఠం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. వేలాది మంది భక్తులు రావడంతో అతిఽథి గృహలు, ప్రైవేట్‌ లాడ్జీలు భక్తులతో నిండిపోయాయి. అద్దె రూములు దొరకక మధ్వమార్గ్‌ కారిడార్‌ ముందే భక్తులు బసచేశారు. అన్నపూర్ణ భోజనశాల, మహాముఖద్వారం, ప్రధాన రహదారులు, రాఘవేంద్ర సర్కిల్‌, నదితీరం భక్తులతో కోలాహలంగా మారింది. గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందా వనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. క్యూలైనన్లు, పరిమళప్రసాదం వద్ద భక్తుల సందడిగా మారింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని శ్రీమఠం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేప ట్టారు. సొంత వాహనాల్లో వచ్చిన భక్తులు ప్రధాన రహదారిపై ఇరు వైపులా పార్కింగ్‌ చేయడంతో ట్రాఫిక్‌ సమస్యతో భక్తులు, గ్రామస్తులు ఇబ్బందులు పడ్డారు.

చెక్క రథంపై ప్రహ్లాదరాయలు: రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు చెక్క రథంపై విహరించారు. శుక్రవారం మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆఽశీస్సులతో పండితులు, అర్చ కులు రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వ హించారు. చెక్క రథాన్ని వివిధ పుష్పాలతో అలంకరించి, వేద పండి తుల మంత్రోచ్ఛరణాలు, మంగళ వాయిద్యాల మధ్య వజ్రాలు పొదిగిన ప్రహ్లాదరాయలను అధిష్టించి ఆలయ ప్రాగణం చుట్టూ ఊరేగించారు. అనంతరం ఊంజలసేవ నిర్వహించారు. అంతక ముందు స్వామి వారికి పాదపూజ చేశారు.

Updated Date - Mar 15 , 2025 | 12:40 AM