సహకార సంఘాల బలోపేతానికి కృషి
ABN, Publish Date - Mar 28 , 2025 | 12:04 AM
: జిల్లా సహకార కేంద్ర బ్యాంకుతో పాటు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేయాలని జాయింట్ కలెక్టర్, బ్యాంకు పర్సన్ ఇన్‌చార్జి నవ్య పిలుపునిచ్చారు.
జాయింట్ కలెక్టర్ నవ్య
కర్నూలు అగ్రికల్చర్, మార్చి 27(ఆంధ్రజ్యోతి): జిల్లా సహకార కేంద్ర బ్యాంకుతో పాటు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేయాలని జాయింట్ కలెక్టర్, బ్యాంకు పర్సన్ ఇన్‌చార్జి నవ్య పిలుపునిచ్చారు. గురువారం నగరంలోని డీసీసీబీ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన జనసభ సర్వసభ్య సమావేశంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి అమలు చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు వాటికి అవసరమైన బడ్జెట్‌కు సంబంధించి ఆమోదం తెలిపారు. ఈ సందర్బంగా జేసీ మాట్లాడుతూ సంఘాల్లో కంప్యూటీకరణ వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో డీసీసీబీ సీఈవో విజయకుమార్, జీఎం రామాంజనేయులు, డీజీఎంలు ఉమామహేశ్వరరెడ్డి, నాగిరెడ్డి, సునీల్ కుమార్, ఏజీఎం త్రినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Mar 28 , 2025 | 12:04 AM