వైసీపీ హయాంలో ఉపాధిని ఊడ్చేశారు
ABN, Publish Date - Jan 11 , 2025 | 12:53 AM
గత వైసీపీ ప్రభుత్వంలో 2023-24 సంవత్సరానికి గానూ ఫీల్డ్ అసిస్టెంట్లు, సీనియర్ మేటిలు కోసిగి మండలంలో ఉపాధిలో ఊడ్చేశారు.
వలంటీర్లు, ఆశా వర్కర్లు, అంగనవాడీలకు మస్టర్లు
కోసిగి మండలంలో ఉపాధిలో అవినీతి 11,57,339
కోసిగి, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో 2023-24 సంవత్సరానికి గానూ ఫీల్డ్ అసిస్టెంట్లు, సీనియర్ మేటిలు కోసిగి మండలంలో ఉపాధిలో ఊడ్చేశారు. ఉపాధి హామీ పథకం అమ లులో వారు చేసిన భాగోతాన్ని సోషల్ ఆడిట్ బృందం బట్టబయలు చేసింది. మండలంలో 24 గ్రామ పంచాయతీల్లో పర్యటించి ఎస్‌ఆర్‌పీ నాగార్జున ఆధ్వర్యంలో డీఆర్పీలు, ఉపాధిలో ఫీల్డ్ అసిస్టెంట్లు, సీనియర్ మేఠీలు చేసిన భాగోతాన్ని బట్టబయలు చేశారు. శనివారం కోసిగిలోని మండల ప్రజా పరిషత కార్యాలయం వద్ద 17వ సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు. అన్ని గ్రామాల్లో అబ్జర్వర్లు పనుల పరిశీలనకు హాజరు కాలేదని ఆడిట్ బృందం సభ్యులు తెలిపారు. అదే విధంగా మస్టర్లలో సంతకాలు లేకుండా వేతనాలు చెల్లించారని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కుంతల్లో చేసిన పనుల్లో 15నుంచి 20శాతం వరకు కొలతల్లో వ్యత్యాసాలు ఉన్నాయని, ఏ గ్రామంలో కూడా జాబ్‌కార్డులు అప్‌డేటు చేయలేదని, ఒకే ఇంటిలో వేర్వేరుగా జాబ్‌కార్డులు ఇచ్చార న్నారు. చేసిన పనులకు జియో ట్యాగింగ్, ఎంబుక్ జిరాక్స్ కొన్ని పను లకు ఇవ్వలేదన్నారు. పెద్దభోంపల్లి గ్రామానికి చెందిన సవారి రామ కృష్ణ, సవారి రాధ భార్యాభర్తలు ఎనిమిదేళ్ల నుంచి హైదరాబాదులో నివాసముంటున్నా 2023-24లో వారి పేర్ల మీద హాజరు వేసి రూ. 51వేలు వేతనం చేశారని గ్రామస్థులు పీడీకి ఫిర్యాదు చేశారు. అలాగే అదే గ్రామానికి చెందిన సుందర్‌రాజు అనే వ్యక్తి కోసిగిలో ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్న కూడా సంవత్సర కాలం పాటు హాజరు వేశారని, పనులకు రాకున్న వేతనాలు అందించారన్నారు. అలాగే డి.బెళగల్ గ్రామానికి చెందిన అయ్యారెడ్డి జాబ్‌కార్డు నెంబర్. 10085 ఏడు సంవత్సరాల క్రితమే చనిపోయినా కూడా నేటికి హాజరు వేశారని, మంగళి రామాంజని జాబ్‌కార్డు నెంబరు 10281 మూడు సంవ త్సరాల క్రితమే మరణించాడని, అలాగే హరిజన వనులయ్య మూడు ఏళ్ల క్రితమే చనిపోయాడని వారికి హాజరులు వేశారని గ్రామస్థులు ప్రిసీడింగ్ అధికారికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అలాగే నేల కోసిగి గ్రామంలో సర్పంచతో పాటు ఎండీఎం, వలంటీర్, మరణించి నాలుగేళ్ల అవుతున్న వ్యక్తులకు కూడా హాజరు వేయడమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి కూడా ఉపాధిలో హాజరు వేసి అవినీతికి తెరలేపారని సోషల్ ఆడిట్‌లో బట్టబయలైంది. మండలంలో అత్యధికంగా చింతకుంటలో రూ.2,99,405లు అవినీతి జరిగినట్లు సామా జిక తనిఖీల్లో విజిలెన్స అధికారులు తెలిపారు, ఐరంగల్‌లో రూ.1,08,097లు కందుకూరులో 1,15,094లు, సాతనూరులో 93,797లు అవినీతి ఉపాధిలో జరిగినట్లు వారు తెలిపారు. మండలం లో మొత్తం మీద రూ.11,57,339లు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీలో బట్ట బయలైంది. వందగల్లులో పండ్లతోటల మొక్కల్లో ఒక మొక్క కూడా కనిపించలేదని అధికారులు ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లపై, ఉపాది సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో అడిషినల్ పీడీ మాధవీ లత, జిల్లా విజిలెన్స అధికారి లోకేశ్వర్, విజిలెన్స అండ్ సెక్షన పీడీ ఆదినారాయణ, ఎస్‌ఆర్‌పీ నాగర్జున, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఏపీవో చంద్రశేఖర్, ఈసీ విజయరాజు, ఎంపీపీ వీరన్న, టీడీపీ జిల్లా ఉపాధ్య క్షుడు ముత్తురెడ్డి, పల్లెపాడు రామిరెడ్డి పాల్గొన్నారు.
Updated Date - Jan 11 , 2025 | 12:53 AM