రీసర్వేను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
ABN, Publish Date - Jan 11 , 2025 | 12:51 AM
భూముల రీ సర్వే ఈనెల 20నుంచి చేయనున్నామని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియో గం చేసుకోవాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్యాభరద్వాజ్ సూచించారు.
ఆదోని సబ్ కలెక్టర్ మౌర్యభరద్వాజ్
పెద్దకడుబూరు, జనవరి 10(ఆంధ్రజ్యోతి): భూముల రీ సర్వే ఈనెల 20నుంచి చేయనున్నామని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియో గం చేసుకోవాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్యాభరద్వాజ్ సూచించారు. శుక్రవారం మండలంలోని నౌలేకల్ గ్రామంలో భూ రీ సర్వేపై అవగా హన సమావేశాన్ని తహసీల్దార్ శ్రీనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్‌కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి రైతు తప్పనిసరిగా రీ సర్వేకు హాజరు కావాలని సూచించారు. రైతులు గ్రామాల్లో లేకపోయినా ఈ విషయాన్ని సర్వే సమయానికి వారికి తెలియజేసి వారు వచ్చేల చూడాలని అధికారులను ఆదేశించారు. రీ సర్వేలో భూముల లొసుగులు ఉంటే వెంటనే చర్యలు తీసుకొని తగిన న్యాయం చేస్తామని, ఇందుకు ప్ర తి ఒక్కరూ సహకరించాలన్నారు. నౌలేకల్‌గ్రామంలో మూడు వేలకుపైగా ఎకరాల భూమి ఉందని ఈ మూడువేల ఎకరాలకు గాను నాలుగు టీం లు ఏర్పాటు చేశామన్నారు. రైతులకు నోటీసులు కూడా పంపిసా ్తమన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
Updated Date - Jan 11 , 2025 | 12:51 AM