శ్రీగిరిపై స్వర్ణ రథోత్సవం

ABN, Publish Date - Feb 10 , 2025 | 12:21 AM

శ్రీశైలం మహా క్షేత్రంలో ఆదివారం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్ల స్వర్ణ రథోత్సవం వైభవంగా జరిగింది.

శ్రీగిరిపై స్వర్ణ రథోత్సవం
భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్ల స్వర్ణ రథోత్సవం

స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు

శ్రీశైలం, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం మహా క్షేత్రంలో ఆదివారం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్ల స్వర్ణ రథోత్సవం వైభవంగా జరిగింది. వేకువ జామున మల్లికార్జున స్వామికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం నిర్వహించారు. అనంతరం ఉదయం 7.30 గంటలకు స్వర్ణరథాన్ని నేత్రశోభితంగా అలంకరించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు స్వర్ణరథానికి కొబ్బరికాయలు, గుమ్మడికాయలు సమర్పించి రథోత్సవాన్ని ప్రారంభించారు. గంగాధర మండపం నుండి నంది మండపం వరకు అశేష భక్తజనం నడుమ స్వర్ణ రథోత్సవం జరిగింది. కోలాటం, చెక్కభజన, జానపద కళాకారుల ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. సీఐ జి. ప్రసాదరావు, దేవస్థానం చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ మఽధుసూదనరెడ్డి పర్యవేక్షించారు.

Updated Date - Feb 10 , 2025 | 12:21 AM