ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం

ABN, Publish Date - Apr 13 , 2025 | 11:48 PM

రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆరోపించారు. ఆదివారం మండలంలోని ఎం.అగ్రహారం గ్రామంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అమలు చేయలేని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు.

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి

మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి ధ్వజం

మద్దికెర, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆరోపించారు. ఆదివారం మండలంలోని ఎం.అగ్రహారం గ్రామంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అమలు చేయలేని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. సూపర్‌ సిక్స్‌ను ఇంత వరకు అమలు చేయలేదన్నారు. పత్తికొండ తాలుకాలో కేవలం మూడు మండలాలు మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించి మరో రెండు మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించలేదని ఆరోపించారు. మాజీ సీఎం, వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రజల తరుపున పోరాటం చేయడానికి సిద్దంగా ఉన్నారన్నారు. రైతులు కరువు కాటకాలతో అల్లాడుతున్నా, ప్రభుత్వ సాయం అందడం లేదన్నారు. సమావేశంలో సర్పంచ్‌ బురుజుల విజయుడు, మండల వైసీపీ అధ్యక్షులు మల్లికార్జున యాదవ్‌, పత్తికొండ మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ ఫక్కీరప్ప, వైసీపీ నాయకులు తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 13 , 2025 | 11:48 PM