ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పేదలకు అండగా పీ-4 విధానం అమలు

ABN, Publish Date - Mar 29 , 2025 | 01:15 AM

పేదలకు అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం పీ-4 విధానాన్ని అమలు చేస్తోందని కలెక్టర్‌ పి.రంజిత బాషా అన్నారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌ రంజిత బాషా

కర్నూలు కలెక్టరేట్‌, మార్చి 28(ఆంధ్రజ్యోతి): పేదలకు అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం పీ-4 విధానాన్ని అమలు చేస్తోందని కలెక్టర్‌ పి.రంజిత బాషా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని కాన్ఫ రెన్స హాల్లో పేదరిక నిర్మూలనకు పీ-4 (ప్రభుత్వ, దాతల, ప్రజల భాగస్వా మ్యం) విధానంపై స్టేఖ్‌ హోల్డర్లతో, ఇండస్ర్టీయల్‌ అసోసి యేషన్స, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లా డుతూ స్వర్ణాంధ్ర-2047లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు డు పేదరికంలేని సమాజంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో పీ-4 (పబ్లిక్‌- ప్రైవేటు-పీపుల్స్‌-పార్టనర్‌షిప్‌) కార్యక్రమాన్ని ఉగాది రోజు ప్రారంభించ నున్నారన్నారు. సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న 10 శాతం మంది అత్యంత పేదరికంలో ఉన్న 20 శాతం మందికి చేయూతనివ్వడం ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. పేదలకు అండగా నిలవాలనుకునే దాతలు, పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వాములై తగిన సహకారం అందజేయవచ్చని అన్నారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ రాష్ట్రాన్ని పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ వికసిత భారత- స్వర్ణాం ధ్ర-2047లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పీ-4 విధానాన్ని అమలు చేస్తోందన్నారు. పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు మాట్లాడారు. ఈ సమావేశంలో సీపీవో హిమ ప్రభాకర్‌రాజు, జిల్లా అధికారులు, పరిశ్ర మల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2025 | 01:15 AM