ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కాల్వబుగ్గ ఆలయాన్ని నందనవనంగా తీర్చిదిద్దుతాం: మల్లెల

ABN, Publish Date - Jan 09 , 2025 | 12:41 AM

తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో కాల్వబుగ్గ రామేశ్వరస్వామి ఆలయాన్ని నందన వనంగా తీర్చిదిద్దుతామని టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్‌ అన్నారు.

కాల్వబుగ్గలో పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్న టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్‌, ఇంజనీర్లు

ఓర్వకల్లు, జనవరి 8(ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో కాల్వబుగ్గ రామేశ్వరస్వామి ఆలయాన్ని నందన వనంగా తీర్చిదిద్దుతామని టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్‌ అన్నారు. బుధవారం మండలంలోని కాల్వబుగ్గ రామేశ్వరస్వామి ఆల యాన్ని మల్లెల రాజశేఖర్‌తోపాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఏఈ లక్ష్మిపతి, జ్యోతిష్యుడు, వాస్తు మునిశంకర్‌, కర్నూలు దేవదా య శాఖ డీఈ శ్రీనివాస ప్రసాద్‌, ఏఈ రవికుమార్‌, ఈవో మద్దిలేటి పరిశీలించారు. వారికి ఈవో మద్దిలేటి, ఆలయ ప్రధాన అర్చకులు కల్లె లక్ష్మీనారాయణ శర్మ స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని చిన్న, పెద్ద కోనేరులను పరిశీలించారు. టీటీడీ చైర్మన నాయుడు, ఈవో శ్యామలారావుకు మల్లెల రాజశేఖర్‌ రూ.12కోట్ల పనులతో చేపట్టే అభివృద్ధి పనులకు సంబందించిన ప్రణాళికను బోర్డు సభ్యులకు ఇచ్చారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఆదేశాల మేరకు ఆలయ వారు కాల్వ బుగ్గను సందర్శించారు. కాల్వబుగ్గలో రూ.12 కోట్ల 12 లక్షలతో వివిధ పనులు స్టోన ఫ్లోరింగ్‌, పశ్చిమాన 5 అంతస్థుల రాజగోపురం పునః నిర్మాణం, మూడంతస్థుల రాజగోపురాల నిర్మాణం, ఆలయ ప్రదేశం చుట్టూ ప్రహరీ నిర్మాణం వంటి పనులను చేపట్టేందుకు నివేదికలు ఇచ్చామన్నారు. కార్యక్రమంలో నాయకులు సుధాకర్‌ రెడ్డి, చంద్ర పెద్దస్వామి, కాటినేని నారాయణ, కాకి దేవేంద్ర, ఆకుల మహేష్‌, కేవీ మధు, అబ్బీ, బజారు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2025 | 12:42 AM