ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కేజీబీవీ ఎస్‌వోను తొలగించాలి: పీడీఎస్‌యూ

ABN, Publish Date - Apr 15 , 2025 | 01:20 AM

కోసిగి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఎస్‌వోను తక్షణమే సస్పెండ్‌ చేయాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కే.భాస్కర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి మహేంద్రబాబు డిమాండ్‌ చేశారు.

డీఈవోకు వినతి పత్రం ఇస్తున్న పీడీఎస్‌యూ నాయకులు

కోసిగి, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): కోసిగి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఎస్‌వోను తక్షణమే సస్పెండ్‌ చేయాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కే.భాస్కర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి మహేంద్రబాబు డిమాండ్‌ చేశారు. ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో ప్రచురితమైన ‘నీళ్లచారే’ కథనానికి కలెక్టరేట్‌లోని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్‌ పాల్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోసిగి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో మెనూ పాటించకుండా తాను పెట్టిందే తినాలంటూ విద్యార్థినులను భయబ్రాంతులకు గురి చేస్తున్న ఎస్‌వోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు రమణ, నగర అధ్యక్షులు దామోదర్‌, ఇమామ్‌బాషా పాల్గొన్నారు.

Updated Date - Apr 15 , 2025 | 01:20 AM