ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇంటర్‌ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం

ABN, Publish Date - Jan 03 , 2025 | 11:51 PM

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

బీ క్యాంప్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల

కర్నూలులో ప్రారంభించనున్న రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌

కర్నూలు ఎడ్యుకేషన్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ డైరెక్టర్‌ సమగ్ర శిక్ష అభియాన్‌ ప్రాజెక్టు అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులు సంయుక్తంగా ఈ పథకాన్ని నిర్వహిస్తున్నారు. ఈ పథకాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. 2019 సంవత్సరం కంటే ముందు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఇంటర్‌ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం పాఠశాలలతో పాటు ఇంటర్‌ ప్రభుత్వ, ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల్లో చదివే విద్యార్థులకు అందించేవారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మధ్యాహ్న భోజన పథకం కళాశాలల్లో అమలుకు మంగళం పాడింది. అప్పటి నుంచి కళాశాలల్లో చదివే పేద విద్యార్థులు ఆకలితో అలమటించారు. నూతనంగా అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 4వ తేదీన విజయవాడలోని పాయకాపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.

మెనూ వివరాలు ఇవే

వారంలో ఆరు రోజులు జూనియర్‌ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తారు. సోమవారం వేడి వేడి పొంగలి, బాయిల్డ్‌ ఎగ్‌, పలావ్‌ విత్‌ ఎగ్‌ కర్రీ, చిక్కి ఇస్తారు. మంగళవారం రాగి జావ, చింతపండు లేదా లెమన్‌ రైస్‌ (పులిహోరా), టమోటా-దొండకాయ కర్రి, చెట్నీ లేదా బాయిల్‌ ఎగ్‌ ఇస్తారు. బుధవారం వెజిటెబుల్‌ రైస్‌, ఆలూ కూర్మ, బాయిల్డ్‌ ఎగ్‌, చిక్కి, గురువారం రాగిజావ, సాంబర్‌ బాత్‌, బాయిల్డ్‌ ఎగ్‌. శుక్రవారం రైస్‌, ఆకుకూర పప్పు, బాయల్డ్‌ ఎగ్‌, చిక్కి, శనివారం రాగిజావ, గ్రీన్‌లీఫ్‌ వెజ్‌ రైస్‌, పప్పు, చారు లేదా స్వీట్‌ పొంగలి అందిస్తారు.

జిల్లాలో 8679 మంది విద్యార్థులకు లబ్ధి

కర్నూలు జిల్లాలోని 23 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 8679 మంది విద్యార్థులు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా లబ్ధ్ది పొందనున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులంతా పేద, మద్యతరగతి కుటుంబాల పిల్లలే. గ్రామీణ విద్యార్థులు ఇంట్లో చద్దన్నం, టిఫిన్‌ తిని ఆఘమేఘాల మీద ఉదయం 9 గంటలకే కాలేజీకి వస్తున్నారు. ఆ టయానికి వంట కాకపోతే మధ్యాహ్న భోజనానికి బాక్సులు తెచ్చుకోలేకపోతున్నారు. కాలేజీ నుంచి ఇంటికి వెళ్లాక భోజనం చేయాల్సి వస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకం తీసుకరావడంతో విద్యార్థుల కష్టాలు తీరనున్నాయి. విద్యార్థుల హాజరు శాతం కూడా పెరిగే అవకాశం ఉంది. చదువుపై దృష్టి పెట్టడంతో వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశం ఉందని అధ్యాపకులు, విద్యావేత్తలు అంటున్నారు.

ఎయిడెడ్‌ కళాశాల విద్యార్థులకు మొండిచేయి

ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల్లో అమలు చేయదల్చుకోలేదు. ఇక్కడ చదివేది పేద విద్యార్థులే. గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వ కళాశాలలతో పాటు ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల్లో చదివే విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అమలు చేసింది. ఈసారి ఎయిడెడ్‌ కాలేజీలను పక్కన పెట్టింది. జిల్లాలో 4 ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో 1069 మంది విద్యార్థులు ఇంటర్‌, ప్రథమ ద్వితీయ సంవత్సరాలు చదువుతున్నారు. ఈ కళాశాలల్లో కూడా మధ్యాహ్న భోజనం పథకం అమలు చేసి ఉంటే పేద విద్యార్థులకు ప్రయోజనం ఉండేది అని విద్యావేత్తలు భావిస్తున్నారు.

అన్ని ఏర్పాట్లు పూర్తి

ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజన పథకం అమలుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. బియ్యం, గుడ్లు తదితర సామగ్రి, తయారీకి వంట పాత్రలు సరఫరా చేశాము. కళాశాలల సమీపంలోని పాఠశాలల వంట ఏజెన్సీలకే ఈ పని అప్పగించాం. ఈ పథకానికి అవసరమయ్యే హెడ్‌ కుక్‌, అసిస్టెంట్ల కుక్‌ ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాము.

- శామ్యూల్‌ పాల్‌, జిల్లా విద్యాశాఖ అధికారి

ఎయిడెడ్‌ కళాశాలలో కూడా అమలు చేయాలి

ప్రభుత్వ కళాశాలలతో పాటు ఎయిడెడ్‌ జూనియర్‌ కాలేజీల్లో కూడా మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలి. ఈ కళాశాలల్లో పేద, మధ్య తరగతి విద్యార్థులే ఉన్నారు. నిర్వీర్యమవుతున్న ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫాం సరఫరా చేస్తే పేద విద్యార్థులకు కొంత ఊరట కలుగుతుంది. దీంతో అడ్మిషన్లు పెరుగుతాయి.

- రాజేష్‌, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి

కర్నూలు నగరంలో ప్రారంభించనున్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌

కర్నూలు నగరంలో శనివారం ప్రభుత్వ టౌన్‌ మోడల్‌ జూనియర్‌ కళాశాల, కేవీఆర్‌ బాలికల ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, పాతనగరం ప్రభుత్వ మైనార్టీ జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర పరిశ్రమల, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి టీజీ భరత్‌ ప్రారంభిస్తారు. ప్రతి కళాశాలలో స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రారంభించేందుకు అహ్వానాలు పంపించాం. మొదటి రోజు ఈ పథకాన్ని విజయవంతం చేసేందుకు ప్రణాళికలు రూపొందించాం.

-వై. పరమేశ్వరరెడ్డి, డీవీఈవో

Updated Date - Jan 03 , 2025 | 11:51 PM