మల్లన్న సన్నిధిలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
ABN, Publish Date - Feb 10 , 2025 | 12:34 AM
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను ఆదివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతి కుమారి ఐఎఎస్ దర్శించుకున్నారు.

శ్రీశైలం, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను ఆదివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతి కుమారి ఐఎఎస్ దర్శించుకున్నారు. స్వామి, అమ్మవార్ల దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న ఎ. శాంతి కుమారికి ఆలయ ఈవో ఎం. శ్రీనివాసరావు, అర్చకులు ఆలయ సంప్రదాయాలతో స్వాగతం పలికారు. అనం తరం ఆమె స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. దర్శనానంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో ఎ. శాంతి కుమారి ఐఏఎస్‌కు వేదపండితులు వేదాశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈవో ఎం. శ్రీనివాసరావు స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేశారు.
Updated Date - Feb 10 , 2025 | 12:34 AM