ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పనిచేసి పస్తులుండాలా?

ABN, Publish Date - Mar 16 , 2025 | 11:57 PM

వలస వెళ్లొద్దు, పనులు కల్పిస్తామని చెప్పి తీరా పనులు చేశాక వేతనాలు ఇవ్వకుండా పస్తులు పెడుతున్నారని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎర్రగుడిలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలు

రెండు నెలలుగా ఉపాధి కూలీలకు వేతనాల్లేవ్‌?

తుగ్గలి, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): వలస వెళ్లొద్దు, పనులు కల్పిస్తామని చెప్పి తీరా పనులు చేశాక వేతనాలు ఇవ్వకుండా పస్తులు పెడుతున్నారని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో 18,707 జాబ్‌కార్డులు ఉన్నాయి. ఈ ఏడాది దాదాపు 5వేల మంది పనులకు వెళుతున్నారు.

వేతనాలు లేవు

పనులు చేసి రెండున్నర నెలలు గడుస్తున్నా వేతనాలు ఇవ్వడం లేదు. వలస వెళ్తే పస్తులుండే బాధ తప్పుతుందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారానికోసారి వేతనాలు ఇస్తే ఇలా పస్తులుండే బాధ తప్పుతుందన్నారు. ఇకపై వేతనాలు ఇచ్చేదాక రామని తెగేసి చెపుతున్నారు.

రెండు నెలలుగా వేతనాలు లేవు

ఉపాధి పనులు చేసి రెండు నెలలైనా వేతనాలు లేవు. ఏ వారం కూలీ ఆ వారమే ఇవ్వాలి. ఇలా అయితే కుటుంబ పోషణ భారమవుతుంది. - సంజీవ, వ్యవసాయ కూలీ, రాతన

ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

వేతనాలు అందకపోవడంతో ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీలకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. వేతనాలు ఇచ్చేందుకు ప్రభ్తుం చర్యలు తీసుకోవాలి. - అక్బర్‌ బాషా, సీనియర్‌ మేటీ, చెన్నంపల్లి

Updated Date - Mar 16 , 2025 | 11:58 PM