ఓబన్న పోరాట స్ఫూర్తి మరువలేనిది
ABN, Publish Date - Jan 11 , 2025 | 11:50 PM
స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న పోరాట స్ఫూర్తి మరువలేనిదని కలెక్టర్ పి.రంజిత్ బాషా అన్నారు.
కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు కలెక్టరేట్, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న పోరాట స్ఫూర్తి మరువలేనిదని కలెక్టర్ పి.రంజిత్ బాషా అన్నారు. శనివారం వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి కలెక్టర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వడ్డే ఓబన్న నంద్యాల జిల్లాలోని సంజామల మండలం నొస్సం గ్రామానికి చెందిన వడ్డే సుబ్బయ్య, సుబ్బమ్మ దంపతులకు 1807 జనవరి 11న జన్మించాడన్నారు. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి ముందే బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో కలిసి వడ్డే ఓబన్న వీరోచితంగా పోరాడారన్నారు. సమాజహితం కోసం వడ్డే ఓబన్న చేసిన సేవలు మరువలేనివని, వారి పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో డీఆర్వో వెంకట నారాయణమ్మ, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి వెంకటేశ్వర్లు, వడ్డెర సంఘం నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Jan 11 , 2025 | 11:50 PM