స్వర్ణ రథంపై విహరించిన ప్రహ్లాదరాయలు
ABN, Publish Date - Jan 03 , 2025 | 12:52 AM
మంత్రాలయం రాఘ వేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు స్వర్ణ రథంపై విహరించారు.
మంత్రాలయం, జనవరి 2(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘ వేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు స్వర్ణ రథంపై విహరించారు. ధనుర్మాసం తదియ రాఘవేంద్రస్వామి సజీవ సమాధి పొందిన గురువారం శుభదినాన్ని పురస్కరించుకుని మఠం పీఠాధి పతి సుబుధేంద్రతీర్థుల ఆధ్వర్యంలో బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెండి మండటపంలో మూలరాములకు, జయరాము లు, దిగ్విజయరాములకు కనకాభిషేకం చేశారు. మధ్య స్వర్ణ రథంపై వజ్రాలు పొదిగిన ప్రహ్లాదరాయలను అధిష్టించి ఆలయ ప్రాంగణం చుట్టూ ఊరేగించారు. అనంతరం ఊంజల సేవ నిర్వహించారు. భక్తు లు గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని రాఘవేంద్రస్వామికి విశేష పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. రాఘవేంద్రస్వామి ఇష్టమైన గురువారం దినం కావటంతో వేలాది మంది భక్తులు తరలివచ్చారు.
Updated Date - Jan 03 , 2025 | 12:52 AM