అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రాధాన్యం
ABN, Publish Date - Jan 03 , 2025 | 12:48 AM
కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యముందని ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు
మద్దికెర, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యముందని ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. గురువారం మద్దికెర గ్రామంలో తారురోడ్డు పనులకు భూమి పూజ, రూ.65 లక్షలతో నిర్మించిన ఓవర్‌హెడ్ ట్యాంకు, గోకులం షెడ్డు, కూరగాయల మార్కెట్‌ను ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ బండారు సుహాసిని ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ మద్దికెర వెనుకబడి ఉందన్నారు. జనవరి 28వ తేదీన పార్లమెంటు సమావేశాలు ఉంటా యని, మద్దికెర సమస్యలన్నీ మంత్రి నితీష్ గడ్కరి దృష్టికి తీసికెళతా అన్నారు. టమోటా జ్యూస్ ఫ్యాక్టరీని ప్రారంభి స్తామని తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పత్తికొండ తెలుగుదేశం పార్టీకి కంచుకోట అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు పురుషోత్తం చౌదరి, జమేదార్ రాజన్న యాదవ్, జిల్లా టీడీపీ కార్యదర్శి గూడూరు ధనుంజయుడు, మాజీ సర్పంచ్ కొత్తపేట వెంకటేశ్వరరెడ్డి, ఎంపీపీ అనిత యాదవ్, తాలుకా తెలుగు యువత అధ్యక్షుడు ఈడిగ చంద్రశేఖర్ గౌడు, నాబార్డు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎం.సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పేదల స్థలాలను అమ్ముకున్నారు
గత వైసీపీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే శ్యాంబాబు ధ్వజం
మద్దికెర, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఇవ్వాల్సిన ఇళ్ల స్థళాల పట్టాలను అమ్ము కున్నారని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ధ్వజమె త్తారు. గురువారం మద్దికెరలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభంలో ఆయన పాల్గొన్నారు. మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే.. గత ప్రభుత్వంలో నాయకులు అమ్ముకున్నాని అన్నారు. పట్టాలు రద్దుచేసి అర్హులైన నిరుపేదలకు మాత్రమే అందజేస్తా మన్నారు. తాలుకాలో సీసీ రహదారులకు రూ.10 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. సీఎం చంద్ర బాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పేదలకు అన్ని సంక్షేత పథకాలు అందుతున్నాయన్నారు. రూ.5 కోట్లతో మద్దికెర-బురుజుల రోడ్డు పనులు త్వరలో ప్రారంభమవుతాయని, జల్‌జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి కొళాయి ఉచితంగా ఇస్తామని తెలిపారు. మాజీ జడ్పీటీసీలు పురుషోత్తం చౌదరి, జమేదార్ రాజన్న యాదవ్, టీడీపీ కార్యదర్శి గూడూరు ధనుంజ యుడు, నాయకులు పెరవలి రామాంజులు, గడ్డం రామాంజులు, జంబునాథ్ రాయుడు, పారా రాఘవేంద్ర, పారా విఠోభ, సంజప్ప, హరినాథ్‌గౌడు తదితరులు ఉన్నారు.
Updated Date - Jan 03 , 2025 | 12:48 AM