జగనన్న కాలనీపై చర్చకు సిద్ధం

ABN, Publish Date - Feb 10 , 2025 | 12:17 AM

జగనన్న కాలనీలో భూ సేకరణపై తాము అవినీతికి పాల్పడలేదని, ఈ విషయంలో ప్రజల మద్య బహిరంగ చర్చకు సిద్దమని వైసీపీ పట్టణ గౌరవ అధ్యక్షుడు చంద్రకాంత్‌ రెడ్డి, మున్సిపాల్‌ వైస్‌ చైర్మన్‌ నరసింహులు, కౌన్సిలర్లు సందీప్‌ రెడ్డి, నాగరాజు ఎమ్మెల్యే పార్థసారథికి సమాల్‌ విసిరారు.

జగనన్న కాలనీపై చర్చకు సిద్ధం
మాట్లాడుతున్న వైసీపీ గౌరవాఽధ్యక్షుడు చంద్రకాంత్‌ రెడ్డి

నెలల ఎమ్మెల్యే సినిమా ట్రైలర్‌ అట్టర్‌ ఫ్లాప్‌

వైసీపీ పట్టణ గౌరవాఽధ్యక్షుడు చంద్రకాంత్‌ రెడ్డి

ఆదోని అగ్రికల్చర్‌, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): జగనన్న కాలనీలో భూ సేకరణపై తాము అవినీతికి పాల్పడలేదని, ఈ విషయంలో ప్రజల మద్య బహిరంగ చర్చకు సిద్దమని వైసీపీ పట్టణ గౌరవ అధ్యక్షుడు చంద్రకాంత్‌ రెడ్డి, మున్సిపాల్‌ వైస్‌ చైర్మన్‌ నరసింహులు, కౌన్సిలర్లు సందీప్‌ రెడ్డి, నాగరాజు ఎమ్మెల్యే పార్థసారథికి సమాల్‌ విసిరారు. ఆదివారం ద్వారక హాలులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రైతుల నుంచి బలవంతంగా ప్రభుత్వం ధర కంటే తక్కువకే కొనుగోలు చేసి అవినీతికి పాల్పడినట్లు కలెక్టర్‌కు ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి ఇచ్చిన రైతులతో కలిసి ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. నిరాధారమైన ఆరోపణలు చేసి ప్రజలను పక్కదారి పట్టించేందుకే ఇలాంటి కుయుక్తులు చేస్తున్నారని ఆరోపించారు, భూములిచ్చిన రైతులతో పాటు, గెలిపించిన ప్రజల మధ్య బహిరంగ చర్చకు రావాలని, తేదీ, సమయం మీరే ఫిక్స్‌ చేసి చెప్పాల న్నారు. ఎమ్మెల్యే వైసీపీ కౌన్సిలర్లు, సర్పం చులను భయపెట్టేందుకే ఇలా మాట్లాడారని, అభివృద్ధిపై దృష్టిపెట్టాలని సూచించారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తే చట్టపరంగా ముందుకెళ్తామని హెచ్చరించారు. కౌన్సిలర్లు ఫయా జ్‌,. అశోక్‌, రాజేశ్వర్‌ రెడ్డి, రఘునాథ్‌ రెడి,్డ దుర్గప్ప, వెంకటేశ్వర రెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, శేషురెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Feb 10 , 2025 | 12:18 AM