ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నేడు రామ్‌కో సిమెంటుపై ప్రజాభిప్రాయ సేకరణ ..

ABN, Publish Date - Jan 03 , 2025 | 12:23 AM

నేడు రామ్‌కో సిమెంటుపై ప్రజాభిప్రాయ సేకరణ ..

రామ్‌కో సిమెంట్‌ పరిశ్రమ

రాజకీయ పార్టీల స్పందనపై సర్వత్రా ఉత్కంఠ

భారీగా బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు

కొలిమిగుండ్ల, జనవరి 2 (ఆంధ్రజ్యోతి) : కొలిమిగుండ్ల సమీపంలోని రామ్‌కో సిమెంట్‌ పరిశ్రమ వద్ద కాలుష్య నియంత్రణ శాఖ ఆధ్వర్యంలో నేడు శుక్రవారం ప్రజాభ్రిపాయ సేకరణ కార్యక్రమం జరగనుంది. సిమెంటు పరిశ్రమ ఉత్పత్తి స్థాయి పెంచుకోవడానికి పర్యావరణ అనుమతుల కోసం ఈ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నారు. దీనిపై వివిధ రాజకీయ పార్టీలు ఎలా స్పందిస్తాయనే దానిపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పరిశ్రమ నుండి వెలువడుతున్న కాలుష్యం వల్ల పంటలు దెబ్బతింటున్నాయని గత రెండు రోజుల క్రితం రైతులు ఆందోళన చేపట్టారు. అయితే రైతుల ఆందోళనకు ఏ రాజకీయ పార్టీ నాయకులు మద్దతు ప్రకటించలేదు. ప్రజాభిప్రాయ సేకరణలో నిరసన గళం వినిపించకుండా పరిశ్రమ వర్గాలు సైతం అత్యంత జాగ్రత్తతో వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ రాజకీయ పార్టీల నేతలను, ప్రజాప్రతినిధులను, వివిధ వర్గాల వారిని కలిసి పరిశ్రమకు సహకరించాల్సిందిగా పరిశ్రమలోని కీలక ప్రతినిధులు కోరారు. దీంతో ప్రజాభ్రిపాయ సేకరణలో నిరసన గళం వినిపించే అవకాశాలు తక్కువేనని చర్చ నడుస్తోంది. అయితే ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారా ..? లేదా అన్నదానిపై స్పష్టత లేకపోవడంతో ఉత్కంఠత ఏర్పడింది. అయితే రైతుల నుండి ఎలాంటి స్పందన ఉంటుందోనని పోలీసులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో ఆలా్ట్రటెక్‌ పరిశ్రమ ప్రజాభిప్రాయ సేకరణలో జరిగిన గందరగోళ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, పెద్ద ఎత్తున బందోవస్తు ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 150 మంది వివిధ స్థాయి పోలీసు అధికారులు, సిబ్బందితో బందోబస్తుకు చర్యలు చేపట్టినట్లు సీఐ రమేష్‌బాబు వెల్లడించారు.

Updated Date - Jan 03 , 2025 | 12:23 AM