శ్రీగిరిపై సంక్రాంతి వేడుకలు
ABN, Publish Date - Jan 11 , 2025 | 12:06 AM
శ్రీశైల మహా క్షేత్రంలో మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలను దేవస్థానం వైభవంగా నిర్వహించనుంది.
శ్రీశైలం, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల మహా క్షేత్రంలో మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలను దేవస్థానం వైభవంగా నిర్వహించనుంది. 11వ తేదీ శనివారం ఉదయం 8:45 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 12వ తేదీన భృంగి వాహన సేవ, 13న కైలాస సేవ, 14న మకర సంక్రాంతి పర్వదినం రోజున నంది వాహనసేవ, కల్యాణోత్సవం, 15న రావణ వాహనసేవ, 16న యాగ పూర్ణాహుతి, కలశోద్వాసన, త్రిశూల స్నానం, ధ్వజావరోణ కార్యక్రమాలు, 17న రాత్రి అశ్వ వాహనసేవ, శయనోత్స వం, ఏకాంత సేవలతో ఉత్సవాలు ముగుస్తాయి.
Updated Date - Jan 11 , 2025 | 12:06 AM