ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మహానందిలో సంక్రాంతి ఉత్సవాలు : ఈఓ

ABN, Publish Date - Jan 11 , 2025 | 11:46 PM

మహానంది క్షేత్రంలో మకర సంక్రాంతి పర్వదిన ఉత్సవాలను మూడు రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నట్లు ఈఓ నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి తెలిపారు.

మాట్లాడుతున్న ఈఓ శ్రీనివాసరెడ్డి

మహానంది, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): మహానంది క్షేత్రంలో మకర సంక్రాంతి పర్వదిన ఉత్సవాలను మూడు రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నట్లు ఈఓ నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం దేవస్థానం ప్రధాన కార్యాలయంలో వేదపండితులు రవిశంకర్‌ అవధాని ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఈ ఏడాది మహానంది ఆలయంలో మకర సంక్రాంతి వేడుకలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 13న బోగి పర్వదినం రోజు చిన్నారులకు బోగి పండ్ల కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. 14న మకర సంక్రాంతి రోజు గంగిరెద్దులకు పూజలు చేసి హరిదాసు కీర్తనలు జరుగుతాయన్నారు. 15న గోశాలలో పశువులకు ప్రత్యేక పూజలు, సాయంత్రం పారువేట ఉత్సవం, ముగ్గుల పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో ఏఈఓ ఎర్రమల్ల మధు, పర్యవేక్షకుడు శశిధర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2025 | 11:46 PM