ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భూ సమస్యలకు పరిష్కారం చూపండి

ABN, Publish Date - Jan 11 , 2025 | 12:07 AM

భూ రికార్డుల్లో మ్యుటేషన్ల దిద్దుబాటు, రెవెన్యూ సదస్సుల్లో భూ పరిష్కార నిమిత్తం స్వీకరించిన దరఖాస్తులు క్షేత్ర స్థాయిలో నిశితంగా పరిశీలించి నిర్ణీత కాలపరిమితి లోగా పరిష్కార మార్గాలు చూపాలని కలెక్టర్‌ రాజకుమారి మండల తహసీల్దార్లను, ఆర్డీవోలను ఆదేశించారు.

రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్‌ రాజకుమారి

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల కల్చరల్‌, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): భూ రికార్డుల్లో మ్యుటేషన్ల దిద్దుబాటు, రెవెన్యూ సదస్సుల్లో భూ పరిష్కార నిమిత్తం స్వీకరించిన దరఖాస్తులు క్షేత్ర స్థాయిలో నిశితంగా పరిశీలించి నిర్ణీత కాలపరిమితి లోగా పరిష్కార మార్గాలు చూపాలని కలెక్టర్‌ రాజకుమారి మండల తహసీల్దార్లను, ఆర్డీవోలను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌తో భూ సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూమి రికార్డులలో మ్యుటేషన్ల దిద్దుబాటు కోసం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులతో పాటు రెవెన్యూ సదస్సులో స్వీకరించిన దరఖాస్తులను కూడా పరిశీలించి త్వరతగతిన పరిష్కరించాలని అన్నారు. ఆళ్లగడ్డ, బండిఆత్మకూరు, పాములపాడు, నందికొట్కూరు, నంద్యాల అర్బన్‌, రూరల్‌, పాణ్యం, పగిడ్యాల, తదితర మండలాల్లో, వీఆర్‌ఓ, తహసీల్దార్‌, ఆర్డీఓ లాగిన్‌లలో పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్‌ ట్రాన్స్‌యాక్షన్‌ దరఖాస్తులను క్లియర్‌ చేయాలని ఆదేశించారు. రెవెన్యూ సదస్సులో స్వీకరించిన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతోపాటు 45 రోజుల్లో రీసర్వే నిర్వహించి భూ సమస్యలను పరిష్కరించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులకు కౌంటర్‌ వేయడంతోపాటు కోర్టు మధ్యంతర, తుది ఉత్తర్వులను కచ్చితంగా అమలు పరచాలన్నారు. పరిశ్రమలు, సాగు నీటి ప్రాజెక్టులు, జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణ వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రతి మండలంలో పైలెట్‌ ప్రాతిపదికన గ్రామాన్ని ఎంపిక చేసుకొని గ్రామ సరిహద్దులు, ప్రభుత్వ భూమి సరిహద్దులు గుర్తించి రీసర్వే పనులు ప్రారంభించాలని కలెక్టర్‌ ఆదేశించారు. గ్రామ సభ నిర్వహించే రోజు గ్రామస్తులందరికీ తెలిసేలా ముందుగానే దండోరా వేయించి విస్తృత ప్రచారం చేయాలన్నారు.

Updated Date - Jan 11 , 2025 | 12:07 AM