ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శ్రీగిరికి సంక్రాంతి శోభ

ABN, Publish Date - Jan 11 , 2025 | 11:47 PM

శ్రీగిరికి సంక్రాంతి శోభ

మొదలైన బ్రహ్మోత్సవాలు

ఈనెల 17న ముగింపు

శ్రీశైలం, జనవరి 11 (ఆంఽధ్రజ్యోతి): ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైలం మహాక్షేత్రంలో శనివారం సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. పంచాహ్నిక దీక్షతో నిర్వహించే ఈ ఉత్సవాలు ఈ నెల 17 తేదీ శుక్రవారంతో ముగియనున్నాయి. ఏడు రోజులపాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు మొదటి రోజు ఉదయం 8.45 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశంతో ప్రారంభమయ్యాయి. లోక కల్యాణం కోసం నిర్వహించే బ్రహ్మోత్సవాలలో ప్రతి రోజూ జ్యోతిర్లింగస్వరూపుడైన మల్లికార్జునస్వామివారికి, మహాశక్తిస్వరూపిణి అయిన భ్రమరాంబికాదేవి అమ్మవారికి విశేషార్చనలు, ప్రత్యేక పూజలు, నవగ్రహ మండపారాధనలు, కలశార్చనలు, పారాయణాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేదపండితులు, అధికారులు యాగశాల ప్రవేశం చేసి అనంతరం వేదపండితులు చతుర్వేద పారాయణాలతో వేదస్వస్తి నిర్వహించారు. ఉత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజను చేసి, శివ సంచార దేవతలలో ఒకరైన చండీశ్వరునికి పూజలు జరిపారు. తరువాత రుత్విగ్వరణం నిర్వహించి, అఖండ దీపస్థాపన, వాస్తుపూజ, వాస్తు హోమం చేశారు. సాయంకాలం అంకురార్పణ తర్వాత ఆలయ ప్రాంగణంలో నంది ధ్వజపటాన్ని ఆవిష్కరించారు. అనంతరం భేరీపూజ నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు దంపతులు పాల్గొన్నారు. శ్రీశైలం దేవస్థానం ధర్మపథంలో భాగంగా నిత్యకళారాధన కార్యక్రమంలో సాయంత్రం హైదరాబాదుకు చెందిన అమృతాసింగ్‌ బృందం నృత్యప్రదర్శన అలరించింది.

నేడు స్వామి, అమ్మవార్లకు భృంగి వాహనసేవ

బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం స్వామి, అమ్మవార్లకు విశేషపూజలు, భృంగివాహన సేవ నిర్వహించనున్నారు.

Updated Date - Jan 11 , 2025 | 11:47 PM