ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యార్థులు సృజనాత్మకత పెంచుకోవాలి: కలెక్టర్‌

ABN, Publish Date - Jan 03 , 2025 | 11:22 PM

విద్యార్ధులు సృజనాత్మకతను పెంచుకొని చదివితే ఉన్నత స్ధితిలో రాణించగలుగుతారని కలెక్టర్‌ రాజకుమారి అన్నారు.

సైన్స్‌ఫెయిర్‌ను తిలకిస్తున్న కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల కల్చరల్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): విద్యార్ధులు సృజనాత్మకతను పెంచుకొని చదివితే ఉన్నత స్ధితిలో రాణించగలుగుతారని కలెక్టర్‌ రాజకుమారి అన్నారు. శుక్రవారం నంద్యాల ఎస్పీజీ పాఠశాలలోని జిల్లా స్ధాయి సదరన్‌ సైన్స్‌ ఫెయిర్‌ కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్య అతిఽథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రాజకుమారి మాట్లాడుతూ విద్యార్ధులు పాఠ్యాంశాలను కంఠస్థం చేయకుండా సృజనాత్మకంగా నేర్చుకో వాలని అన్నారు. పాఠశాలలో నిర్వహించే వ్యాసరచన, వ క్తృత్వ, చిత్రలేఖన సైన్స్‌ఫెయిర్‌లాంటి పోటీలలో విద్యార్ధులందరూ భాగస్వాములు కావాలని అన్నారు. సమగ్ర శిక్ష సెక్టోరియల్‌ అధికారులు, డీఈఓ జనార్దన్‌రెడ్డి, సమగ్ర శిక్ష అభియాన్‌ అడిషనల్‌ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ ప్రేమంతకుమార్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యారుఽ్ధలు, తల్లితండ్రులు పాల్గొన్నారు.

‘ఉపాధి పనుల్లో నిర్లక్ష్యం వీడండి’

నంద్యాల కల్చరల్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉపాధి హామీ పధకం కింద పనులు కల్పించడంలో నిర్లక్ష్యాన్ని విడనాడాలని కలెక్టర్‌ రాజకుమారి ఏపీడీ, ఏపీఓలను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుండి ఉపాధి హామీ లక్ష్యాల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రాజ కుమారి మాట్లాడుతూ లేబర్‌ బడ్జెట్‌ కింద వందరోజుల పనిదినాలు కల్పించడంలో పూర్తిగా వెనుకబడి ఉన్నారన్నారు. జిల్లాలో 2.3 లక్షల మంది కూలీలు ఉంటే కేవలం మూడువేల మందికి మాత్రమే వందరోజుల పనిదినాలు కల్పించడంపై కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.

Updated Date - Jan 03 , 2025 | 11:22 PM