ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

ABN, Publish Date - Mar 29 , 2025 | 12:03 AM

ప్రజా సమస్యలు గుర్తించి తక్షణం పరిష్కరించడమే లక్ష్యమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహారశుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్‌ పేర్కొన్నారు.

వినతులు స్వీకరిస్తున్న మంత్రి టీజీ భరత్‌, కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా

ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదు

మంత్రి టీజీ భరత్‌

‘మీ సమస్య - మా పరిష్కారం’ కార్యక్రమానికి శ్రీకారం

కలెక్టర్‌ పి. రంజిత్‌బాషా సహా వివిధ శాఖల అధికారులు హాజరు

కర్నూలు, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలు గుర్తించి తక్షణం పరిష్కరించడమే లక్ష్యమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహారశుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్‌ పేర్కొన్నారు. కర్నూ లు నియోజకవర్గం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణ పరి ష్కారం చూపాలనే ఆశయంలో ‘మీ సమస్య - మా పరిష్కారం’ సరికొత్త కార్యక్రమానికి స్థానిక శ్రీఆర్య ఫంక్షన్‌ హాల్‌లో కలెక్టర్‌ పి. రంజిత్‌బాషాతో మంత్రి టీజీ శుక్రవారం శ్రీకారం చుట్టారు. కర్నూలు నగరపాలక సంస్థ అధికారులతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు. వివిధ సమస్యలపై 144 మందికి పైగా వినతి పత్రాలు ఇచ్చారు. మంత్రి టీజీ భరత్‌, కలెక్టర్‌ పి. రంజిత్‌బాషా ప్రజలు వినతులను స్వీకరించారు. వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి టీజీ భరత్‌ మాట్లా డుతూ ప్రజలు మధ్యలో ఉంటూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం పని చేస్తున్న దన్నారు. ప్రతి సోమవారం కలెక్టర్‌, ఎస్పీల అధ్యక్షతన ప్రజా సమ స్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)లో వినతలు స్వీకరించి పరిష్క రిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ సి. వెంకట నారాయణమ్మ, మున్సిపల్‌ కమిషనర్‌ రవీంద్రబాబు, టౌన్‌ డీఎస్పీ బాబు ప్రసాద్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2025 | 12:03 AM