ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బాల్య వివాహాలతో అనర్థాలు

ABN, Publish Date - Apr 05 , 2025 | 01:07 AM

బాల్య వివాహాలతో అనర్థాలు తప్పవని, వీటిని నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలను అమల్లోనికి తెచ్చిందని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ పి.ని ర్మల తెలిపారు.

చైల్డ్‌ హెల్ప్‌లైన కరపత్రాలతో ఐసీడీఎస్‌ పీడీ నిర్మల తదితరులు

ఐసీడీఎస్‌ పీడీ నిర్మల

కర్నూలు హాస్పిటల్‌, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): బాల్య వివాహాలతో అనర్థాలు తప్పవని, వీటిని నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలను అమల్లోనికి తెచ్చిందని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ పి.ని ర్మల తెలిపారు. మహిళ, శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నగ రంలోని బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా పీడీ నిర్మల మాట్లాడుతూ బాల్య వివాహాలు జరు గుతున్నా యన్న సమచారం వచ్చినప్పుడు వీటిని ఆపడం కన్నా ముం దుగా ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ముందుగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కిషోర బాలికల వివరాలు తెలుసుకుని ఎంత మంది స్కూల్స్‌, కాలేజీలకు వెళ్తున్నారా లేదా.. మధ్యలో మానేశారా..? సర్వే చేయాలన్నారు. అమ్మాయిలకు 18 సంవత్సరాలు, అబ్బాయిలకు 21 సంవత్సరాలు పూర్త యిన తర్వాతనే వివాహాలు చేయాలన్నారు. జిల్లా బాలల పరీరక్షణ అధికా రి టి.శారద మాట్లా డుతూ జిల్లాల బాలల సమస్యలు ఎదురైనప్పుడు చైల్డ్‌ హెల్ప్‌లైన నెంబర్‌ 108కి తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సూపర్‌ వైజర్లు కర్నూలు అర్బన సీడీపీవో, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2025 | 01:07 AM