రేషన పంపిణీలో పొరపాట్లు జరగరాదు
ABN, Publish Date - Jan 04 , 2025 | 12:36 AM
రేషన పంపిణీ చేసే ప్రక్రి యలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను సబ్‌కలెక్టర్ మౌర్యాభరద్వాజ్ ఆదేశించారు.
ఎమ్మిగనూరు, జనవరి 3(ఆంధ్రజ్యోతి): రేషన పంపిణీ చేసే ప్రక్రి యలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను సబ్‌కలెక్టర్ మౌర్యాభరద్వాజ్ ఆదేశించారు. శుక్రవారం మం త్రాలయం రోడ్డులో ఉన్న పౌరసరఫరా గోదామును సబ్‌కలెక్టర్ పరిశీ లించారు. గోదాములో ఉన్న బియ్యం, చెక్కెరతో పాటు ఇతర రేషన నిల్వలను, రికార్డులను పరిశీలించారు. రేషన నిల్వల భద్రత గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రేషన పంపిణీ సక్రమంగా జరిగేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా రేషనకార్డుదారులందరికి రేషన అందేలా చూడాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ శేషఫణి, గోడౌన డీటీ మహేష్, ఆర్‌ఐ లక్ష్మన్న, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Jan 04 , 2025 | 12:36 AM