ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆలోచింపజేసిన చిగురు మేఘం

ABN, Publish Date - Jan 03 , 2025 | 12:26 AM

వైద్యులు పల్లెల నుంచి ఎదిగి, నగరాల్లో కార్పొరేట్‌ ఆసుపత్రులు పెట్టి ధన సంపాదనే ముఖ్యమై పేదల వైద్య సేవలు మర్చిపోతున్నారనే ఇతివృత్తంతో సాగిన ‘చిగురు మేఘం’ నాటిక ఆలోచింపజేసింది.

చిగురుమేఘం సాంఘిక నాటిక ప్రదర్శనలో ఓ సన్నివేశం

రెండో రోజు రాష్ట్రస్థాయి నాటకోత్సవాలు

కర్నూలు కల్చరల్‌, జనవరి 2(ఆంధ్రజ్యోతి): వైద్యులు పల్లెల నుంచి ఎదిగి, నగరాల్లో కార్పొరేట్‌ ఆసుపత్రులు పెట్టి ధన సంపాదనే ముఖ్యమై పేదల వైద్య సేవలు మర్చిపోతున్నారనే ఇతివృత్తంతో సాగిన ‘చిగురు మేఘం’ నాటిక ఆలోచింపజేసింది. ‘ఇది ఇతని సంతకం కాదు’ అన్న మరో నాటిక ఆధ్యంతం ఆకట్టుకుంది. కర్నూలు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో రెండో రోజు గురువారం రాష్ట్ర స్థాయి నాటకోత్సవాలు కొనసాగాయి. హైదరాబాదు మహతీ క్రియేషన్స్‌, కర్నూలులోని టీజీవీ కళాక్షేత్రం సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ నాటిక ప్రదర్శనలను సినీ నటులు సుబ్బరాయ శర్మ, గోపరాజు రమణ, కళాక్షేత్రం అధ్యక్షుడు విద్వాన్‌ పత్తి ఓబులయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిష్ణాతులైన కళాకారులు తమ నాటికల ద్వారా ప్రేక్షకులకు వినోదాన్ని పంచడం ప్రశంసనీయమని అన్నారు. నాటకం సజీవమైనదని, దాన్ని ప్రాణపదంగా చూసుకోవడం కళాకారులకు ఒక పరీక్ష వంటిదని అన్నారు. కర్నూలులోని టీజీవీ కళాక్షేత్రంలో వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు తమ ప్రదర్శనలు ఇవ్వడం ఒక ప్రత్యేక సందర్భంగా నిలుస్తోందని చెప్పారు. కళాకారులకు తనవంతు చేయూత అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. సన్మాన గ్రహీత, సినీ టీవీ రంగస్థల నటుడు గోపరాజు రమణ మాట్లాడుతూ 1995 నుంచీ నాటక రంగంతో అనుబంధం ఉందని, అనంతరం టీవీ, సినిమాల్లో రావడానికి సుబ్బరాయశర్మ సహకారం మర్చిపోనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీ బస్తిపాటి నాగరాజును కళాకారులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాక్షేత్రం కార్యదర్శి మహ్మద్‌ మియా, వ్యాఖ్యాత ఇనాయతుల్లా, శ్రీనివాసరెడ్డి, సంగా ఆంజనేయులు, వి.రాముడు, హార్మోనిస్ట్‌ పాండురంగయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రేక్షకులను అలరించిన నాటక ప్రదర్శనలు...

నాటకోత్సవాల్లో రెండో రోజు గురువారం రాత్రి ప్రదర్శించిన రెండు నాటికలు వేటికవే పోటీగా నిలి చాయి. తొలుత గుంటూరు అమరావతి ఆర్ట్స్‌ సంస్థ వారి ‘చిరుగు మేఘం’ ప్రదర్శించారు. కావూరి సత్యనారాయణ రచించిన ఈ నాటకానికి పప్పూరి హరిబాబు దర్శకత్వం వహించారు. స్వయంగా పేదలైన తల్లిదండ్రులే కార్పొరేట్‌ ఆసుపత్రులకు వస్తే వారిని ఏ విధంగా ఇబ్బందులకు గురిచేసిందీ ఈ నాటిక తెలియజేస్తుంది. కార్పొరేట్‌ నుంచీ గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి సేవలు చేసిన వైద్యుల జీవితం ధన్యం అనే సందేశంతో ఈ నాటకం పూర్తవు తుంది. ఇందులో వివిధ పాత్రల్లో ఏపూరి హరిబాబు, కోనపరెడ్డి మస్తాన్‌రావు, సరిత, కావూరి సత్యనారాయణ, నాగరాణి, ప్రసాద్‌, రాజశేఖర్‌లు నటించారు. రెండో నాటికగా గుంటూరు అభినయ ఆర్ట్స్‌ సంస్థ వారు ‘ఇది ఇతని సంతకం కాదు’ ప్రదర్శించారు. ఈ నాటికను స్నిగ్ధ రాయగా రవీంద్రారెడ్డి దర్శకత్వం వహించారు. ప్రతి మనిషికి ఒక బలమైన లక్ష్యం, అందుకు తగిన ప్రణాళిక ఉండాలని అది లేని జీవితం వ్యర్థమని ప్రబోధిస్తుంది. సిద్ధాంతాలకు కట్టుబడి సాగించే జీవితం నిజమైన జీవితమని ఈ నాటిక తెలియజేస్తుంది.

Updated Date - Jan 03 , 2025 | 12:26 AM