అవుట్‌డోర్ స్టేడియం నిర్మాణానికి కృషి
ABN, Publish Date - Feb 10 , 2025 | 12:16 AM
పట్టణంలో అవుట్‌డోర్ స్టేడియాన్ని నిర్మించేందుకు కృషిచేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ పార్ధసారఽథి హామీ ఇచ్చారు. స్థానిక మున్సిపల్ మైదానంలో ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించిన ప్రెండ్‌షిప్ కప్ క్రికెట్ టోర్నమెంట్ అదివారం ముగిసింది

ఎమ్మెల్యే పార్థసారథి
ఆదోనిలో ముగిసిన ఉద్యోగుల ఫ్రెండ్‌షిప్ కప్ క్రికెట్ టోర్నమెంట్
ఆదోని అగ్రికల్చర్, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి) : పట్టణంలో అవుట్‌డోర్ స్టేడియాన్ని నిర్మించేందుకు కృషిచేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ పార్ధసారఽథి హామీ ఇచ్చారు. స్థానిక మున్సిపల్ మైదానంలో ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించిన ప్రెండ్‌షిప్ కప్ క్రికెట్ టోర్నమెంట్ అదివారం ముగిసింది. పైనల్ మ్యాచ్ విజేలకు ఎమ్మెల్యే పార్థసారథి, కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప తాలూకా క్రికెట్ అసోసియేషన్ విట్టా రమేష్, జనసేన నేత మల్లప్ప బహుమతులు ప్రదానం చేశారు. ఫైనల్ మ్యాచ్ ఏఎంసీ 11 వర్సెస్ పీఈటీ జట్ల మధ్య హోరాహోరీగా సాగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఏఎంపీ జట్టు 8 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేయగా, పీఈటీ జట్టు 8 ఓవర్లలో 115 పరుగులు సాధించి విజేతగా నిలిచింది. మ్యాన్ ఆఫ్ దిసీరిస్, బెస్ట్ బ్యాటర్‌గా సీనా, బౌలర్‌గా పోస్టల్ ఉద్యోగి వీరేష్‌కు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతోమంది నైపుణ్యంగల క్రీడాకారులు ఆదోనిలో ఉన్నారని, వారిని ప్రోత్సహించడానికి టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఉద్యోగులు విధి నిర్వహణలో తీరిక లేక ఉంటారని ఈ క్రీడలతో మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందారన్నారు. నిర్వాహకుడు ముజీబ్ అహ్మద్ దాతలు వెల్లాల మధుసూదన్ శర్మ, మర్చంట్ క్లబ్ అధ్యక్షులు మల్లికార్జున పాల్గొన్నారు.
బ్యాటింగ్ చేసిన ఎమ్మెల్యే
ఆదోని: టోర్నంమెంట్‌లో ఉద్యయయగులతో కలిసి ఎమ్మెల్యే బ్యాటింగ్ చేసి వారిని ఉత్సాహ పరిచారు. ఆటలో గెలుపోటములు సాధారణమని సమానంగా తీసుకోవాలని సూచించారు. బీజేపీ నాయకులు విట్టా రమేష్, వెల్లాల మధుసూదన్ శర్మ, నాగరాజు గౌడ్, టీడీపీ నాయకులు కురువ మల్లికార్జున, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Feb 10 , 2025 | 12:16 AM