వైద్యశాలకు స్థలం ఎక్కడో..!

ABN, Publish Date - Mar 13 , 2025 | 01:01 AM

మంల కేంద్రంలో పీహెచ్‌సీ నిర్మాణం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే పలుమార్లు స్థల పరిశీలన చేయగా, బుధవారం పత్తికొండ ఆర్డీవో భరత్‌నాయక్‌, తహసీల్దార్‌ ప్రసాద్‌రాజు మరోసారి పరిశీలించారు.

వైద్యశాలకు స్థలం ఎక్కడో..!
స్థల పరిశీలన చేస్తున్న పత్తికొండ ఆర్డీవో భరత్‌నాయక్‌

మొన్న జేసీ, నేడు ఆర్డీవో.. రోజుకో చోట పరిశీలన

దేవనకొండ, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): మంల కేంద్రంలో పీహెచ్‌సీ నిర్మాణం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే పలుమార్లు స్థల పరిశీలన చేయగా, బుధవారం పత్తికొండ ఆర్డీవో భరత్‌నాయక్‌, తహసీల్దార్‌ ప్రసాద్‌రాజు మరోసారి పరిశీలించారు. గ్రామానికి చెందిన మొగతాల్‌ సునీల్‌కుమార్‌ సర్వే నెం.36-1లో తన సొంత భూమిలో ఎకరా స్థలాన్ని తల్లిదండ్రుల జ్ఞాపకార్థం విరాళం ఇస్తున్నట్లు కర్నూలులో జాయింట్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. జేసీ ఆదేశాల మేరకు బుధవారం ఆర్డీవో, తహసీల్దార్‌ తెర్నేకల్‌కు వెళ్లి స్థలాన్ని పరిశీలించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు వైద్యశాలను నిర్మిస్తున్నట్లు ఆర్డీవో తెలిపారు. గత ప్రభుత్వం 46-1 లో 1.5 ఎకరాల్లో అనుమతి ఇచ్చింది. అయితే ప్రజలకు అందుబాటులో లేదని, జడ్పీ పాఠశాల వద్ద సర్వే నెం. 313 లో 1.10 ఎకరాల్లో నిర్మిస్తే అణువుగా ఉంటుందన్నారు. మళ్లీ ఇప్పుడు 36-1లో ఎకరా స్థలాన్ని దాత విరాళం ఇస్తామనడంతో మరోసారి ఏ మలుపు తిరుగుతుందోనని గ్రామస్తులు పేర్కొంటున్నారు.

Updated Date - Mar 13 , 2025 | 01:01 AM