ఆలూరులో విండ్‌ పవర్‌

ABN, Publish Date - Feb 10 , 2025 | 12:01 AM

నియోజకవర్గంలో పారిశ్రామికాభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. విండ్‌ పవర్‌ (పవన విద్యుత్‌) ప్లాంట్లు ఏర్పాటవుతున్నాయి. మొదటి విడతలో విండ్‌ పవర్‌ ప్లాంట్‌లు భారీగానే వెలిశాయి.

ఆలూరులో విండ్‌ పవర్‌
విండ్‌ పవర్‌ ప్లాంట్‌ కోసం వస్తున్న ఫ్యాన్‌లు

ఇప్పటికే 150 యూనిట్లు

రెండు, మూడో విడతల్లో మరిన్ని ఏర్పాటు..

ఆలూరు, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో పారిశ్రామికాభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. విండ్‌ పవర్‌ (పవన విద్యుత్‌) ప్లాంట్లు ఏర్పాటవుతున్నాయి. మొదటి విడతలో విండ్‌ పవర్‌ ప్లాంట్‌లు భారీగానే వెలిశాయి. మొదటి విడతలో 150 యూనిట్లు పనిచేస్తున్నాయి. రెండో విడతలో 300 మంజూరు కాగా, సగం మొదల య్యాయి. మూడో విడతలో 200లకు పైగా విండ్‌ పవర్‌ ప్లాంట్లు వెలిశాయి.

భూముల ధరలకు రెక్కలు

విండ్‌ పవర్‌ ప్లాంట్ల ఏర్పాటుతో భూముల ఽధరలు పెరిగిపోయాయి. ఒక్కో ప్లాంట్‌ ఏర్పాటుకు 8.73 ఎకరాలు అవసరం. ఇందులో 1.40 ఎకరాలను కొనుగోలు చేస్తారు. మరో 7.33 ఎకరాల భూమిని 33 సంవత్సరాల పాటు లీజ్‌కు తీసుకుంటారు. వీటిని రెండు ప్రధాన కంపెనీలు నిర్వహిస్తున్నారు.

300 మంది ఉద్యోగ అవకాశాలు

విండ్‌ పవర్‌ ప్యానళ్ల ఏర్పా టుతో 300మందికి ఉద్యోగా లు లభించాయి. అయితే వీటి ఏర్పాటుతో పట్టణంలో ఇంటి అద్దెలు భారీగా పెరిగాయి. రూ.10 నుంచి 20 వేలకు కూడా ఇల్లు దొరకడం లేదు.

దళారులకు కాసుల వర్షం

దొరికిందే అదనుగా దళారులు రంగంలోకి దిగారు. రైతులతో మాట్లాడి భూములను ఇప్పిస్తానమి భారీగా కమీషన్‌ వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరికొందరు చోటా మోటా నాయకులు కూడా తమకు ముట్టజెప్పాల్సిందేనని ప్లాంట్ల నిర్వాహకులకు సూచిస్తున్నారు.

Updated Date - Feb 10 , 2025 | 12:01 AM