Free Gas Cylinder: తొలి ఉచిత గ్యాస్‌ సిలిండర్‌కు 4 రోజులే గడువు

ABN, Publish Date - Mar 27 , 2025 | 04:21 AM

ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పొందేందుకు మరో నాలుగు రోజుల మాత్రమే అవకాశం ఉంది. మార్చి 31తో గడువు ముగుస్తుంది. ఇప్పటివరకు 98 లక్షల మంది లబ్ధిదారులు దీనిని పొందారు. అర్హులైన వారు వెంటనే బుక్‌ చేసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్‌ సూచించారు. చెల్లింపు చేసిన 48 గంటల్లో రీఫండ్ లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతుంది.

Free Gas Cylinder: తొలి ఉచిత గ్యాస్‌ సిలిండర్‌కు 4 రోజులే గడువు

ఇంకా బుక్‌ చేసుకోనివారు వెంటనే చేసుకోవాలి

పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌ పిలుపు

అమరావతి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): ‘తొలి ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ను పొందడానికి ఇక నాలుగు రోజులే అవకాశం ఉంది. ఈనెల 31తో గడువు ముగిసిపోతుంది. ఇప్పటి వరకు మొదటి ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసుకోని అర్హులైనవారందరూ వెంటనే బుక్‌ చేసుకోవాలి’ అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ లబ్ధిదారులకు పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు 98 లక్షల మంది తొలి ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ను పొందారని తెలిపారు. లబ్ధిదారులు గ్యాస్‌ బుక్‌ చేసుకొని, యథావిధిగా సొమ్ము చెల్లిస్తే సిలిండర్‌ డెలివరీ అయిన 48 గంటల్లోపు ఆ సొమ్ము తిరిగి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని వివరించారు. ఈ మేరకు బుధవారం ఒక వీడియో సందేశాన్ని మంత్రి విడుదల చేశారు.


ఇవి కూడా చదవండి:

చిత్రం భళారే విచిత్రం

Yogi Adityanath: యోగి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

కొబ్బరి నీళ్ల కంటే.. మంచి నీళ్లు మేలు.. డాక్టరేంటి ఇలా అన్నాడు..

Updated Date - Mar 27 , 2025 | 04:21 AM