Leopard Attacks : టీటీడీ ఉద్యోగిపై దాడికి యత్నించిన చిరుత
ABN, Publish Date - Jan 12 , 2025 | 06:42 AM
తిరుపతిలో ఓ చిరుత దాడికి ప్రయత్నించడంతో ద్విచక్ర వాహనంపై వెళుతున్న టీటీడీ ఉద్యోగి గాయాలపాలయ్యారు. తిరుపతి రూరల్ మండలం
తిరుపతి(నేరవిభాగం), జనవరి 11 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలో ఓ చిరుత దాడికి ప్రయత్నించడంతో ద్విచక్ర వాహనంపై వెళుతున్న టీటీడీ ఉద్యోగి గాయాలపాలయ్యారు. తిరుపతి రూరల్ మండలం పేరూరుకు చెందిన డి.మునికుమార్ తిరుమల అశ్విని ఆస్పత్రిలో ఎంఎన్‌వోగా పనిచేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం 1.10 గంటలకు ఇంటి నుంచి విధులకు బయల్దేరారు. చెర్లోపల్లి రోడ్డులోని వేదిక్ వర్సిటీ వద్దకు రాగానే చెట్టుపై నుంచి చిరుత ఒక్కసారిగా కిందకు దూకింది. భయపడిన మునికుమార్ ద్విచక్ర వాహనం నుంచి కిందపడ్డారు. అదే సమయంలో వాహనాలు, జనం రోడ్డుపైకి చేరడంతో చిరుత అడవిలోకి వెళ్లిపోయింది. మునికుమార్‌ను చికిత్స నిమ్తితం స్విమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు.
Updated Date - Jan 12 , 2025 | 06:42 AM